కరోనా మహమ్మారి నియంత్రణకు ప్రపంచ దేశాలన్నీ కృషి చేస్తున్నాయి. అందులో భాగంగా వ్యాక్సిన్ కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు కూడా తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ టీకాకు తాను వ్యతిరేకం అంటున్నాడు టెన్నిస్ ఆటగాడు జకోవిచ్. టెన్నిస్ ప్లేయర్లు ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవడాన్ని తప్పనిసరి చేయాలన్న మహిళా టెన్నిస్ మాజీ నెంబర్వన్ ఎమెలీ మోరెస్మో సూచనను అతడు వ్యతిరేకించాడు.
"నేనైతే వ్యక్తిగతంగా కరోనా టీకాకు వ్యతిరేకం. ఈ విషయంలో ఎవర్నీ బలవంతం చేయవలసిన అవసరం లేదు. కరోనా టీకాను తప్పనిసరి చేస్తే ఏమౌతుంది. ఏ పని అయినా చేయాల్సి వచ్చినప్పుడు వ్యక్తిగత నిర్ణయాలు అనేవి ఉంటాయి. ఇక్కడ నేనే నిర్ణయం తీసుకోవాలి. నా ఆలోచనల ప్రకారమే నిర్ణయం తీసుకుంటాను. సమయాన్ని బట్టి ఆలోచనలు మారతాయి."