తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఈ విజయం ఎంతో ఉద్వేగభరితం: రఫెల్ నాదల్

హోరాహోరీగా సాగిన యూఎస్​ ఓపెన్​ ఫైనల్​లో​ విజేతగా నిలవడం తనకెంతో ఉద్వేగభరితమైనదని చెప్పాడు స్టార్ ప్లేయర్ రఫెల్ నాదల్.ఈ టోర్నీలో నాలుగోసారి విజేతగా నిలిచాడీ స్పెయిన్​ బుల్.

యూఎస్ ఓపెన్-2019 విజేత రఫెల్ నాదల్

By

Published : Sep 9, 2019, 10:20 AM IST

Updated : Sep 29, 2019, 11:14 PM IST

యూఎస్ ఓపెన్​ టైటిల్​ను నాలుగోసారి దక్కించుకున్నాడు స్టార్ టెన్నిస్ ప్లేయర్ రఫెల్ నాదల్. తుదిపోరులో రష్యాకు చెందిన మెద్వదేవ్​ను 7-5, 6-3, 5-7, 4-6, 6-4 తేడాతో ఓడించి ఛాంపియన్​గా నిలిచాడు. అనంతరం స్పందించిన నాదల్.. ఈ విజయం తన కెరీర్​లోనే ఉద్వేగభరితమైనదని అన్నాడు.

యూఎస్ ఓపెన్ విజేత నాదల్- రన్నరప్​ మెద్వదేవ్

"నా టెన్నిస్​ కెరీర్​లో ఇది ఎంతో ఉద్వేగభరితమైన రాత్రి. నరాలు తెగే ఉత్కంఠతో సాగిన ఈ మ్యాచ్​లో విజయం సాధించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది". -రఫెల్ నాదల్, యూఎస్ ఓపెన్ విజేత

రికార్డు బ్రేక్‌
30 ఏళ్ల వయసు తర్వాత ఐదు టైటిల్స్‌ నెగ్గిన ఆటగాడిగా రఫెల్‌ నాదల్‌ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 33 ఏళ్ల నాదల్‌.. యూఎస్‌ ఓపెన్‌ ఛాంపియన్​గా నిలవడం ఇది నాలుగోసారి. గతంలో మూడుసార్లు (2017, 2013, 2010) విజేతగా నిలిచిన అతడు ఒకసారి రన్నరప్‌ (2011)తో సరిపెట్టుకున్నాడు. కెరీర్‌లో 27 గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌ ఆడిన ఈ స్పెయిన్​బుల్.. 19 సార్లు గెలిచి, ఎనిమిదింటిలో ఓడిపోయాడు.

ఇది చదవండి: రఫ్పాడించిన నాదల్.. యూఎస్ ఓపెన్ కైవసం

Last Updated : Sep 29, 2019, 11:14 PM IST

ABOUT THE AUTHOR

...view details