ఫ్రెంచ్ ఓపెన్‌లో నొవాక్ జకోవిచ్‌కు షాక్ తగిలింది. సెమీస్‌లో ఆస్ట్రియా ఆటగాడు డొమనిక్ థీమ్‌తో జరిగిన హోరాహోరీ పోరులో జకో ఓడిపోయాడు. థీమ్ 6-2, 3-6, 7-5, 5-7, 7-5 తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించాడు.
ఫ్రెంచ్ ఓపెన్: సెమీస్‌లో జకో ఔట్.. ఫైనల్లోకి థీమ్ - djaco
ఫ్రెంచ్ ఓపెన్ 2019లో ఫైనల్‌కు చేరాడు ఆస్ట్రియా ఆటగాడు డొమనిక్ థీమ్. సెమీస్‌లో ప్రపంచ నెంబర్ వన్ జకోవిచ్‌ను ఓడించాడు. ఆదివారం జరగనున్న ఫైనల్లో రఫెల్ నాదల్‌తో తలపడనున్నాడు.
ఫ్రెంచ్ ఓపెన్
ప్రపంచ నెంబర్ వన్ స్థానంలో ఉన్న జకోవిచ్ 4వ సీడ్ ఆటగాడైన థీమ్ చేతిలో పరాజయం చెందాడు. ఈ విజయంతో తన కేరీర్‌లోనే రెండో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడనున్నాడు థీమ్. ఆదివారం స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌తో తలపడనున్నాడు. శుక్రవారం వర్షం కారణంగా ఆగిపోయిన మ్యాచ్ నేడు పునఃప్రారంభమైంది.
ఫ్రెంచ్ ఓపెన్‌ను 11 సార్లు కైవసం చేసుకున్నాడు నాదల్. ఫైనల్ చేరిన ప్రతీసారి టైటిల్ సాధించాడీ స్పెయిన్ బుల్. మొత్తం 17 గ్రాండ్‌స్లామ్‌లు గెలుచుకున్నాడు.