ఆటలో నియంత్రణ కోల్పోవడం ఆటగాళ్లకు సహజమే.. ఇలాంటి సమయంలో ఓర్పుగా ఉండాలి.. కానీ ఆ కోపాన్ని ప్రత్యర్థులపైనో.. వేరే ఇంకెవరిపైనో చూపిస్తుంటారు చాలా మంది ప్లేయర్లు. తాజాగా గ్రీస్ టెన్నిస్ స్టార్ స్టెఫానో సిట్సిపాస్ తన కోపాన్ని నియంత్రించుకోలేకపోయాడు. ఆవేశంతో రాకెట్‌ను నేలకేసి బాదుతూ.. సొంత తండ్రినే కొట్టేశాడు.
ఈ ఘటన ఆస్ట్రేలియా బ్రిస్బేన్‌లో జరుగుతున్న ఏటీపీ కప్‌లో చోటు చేసుకుంది. ఆసీస్ ప్లేయర్ నిక్ కిర్గియోస్‌తో జరిగిన మ్యాచ్‌లో సిట్సిపాస్ తొలి సెట్ కోల్పోయాడు. అనంతరం కోపాన్ని ఆపుకోలేని గ్రీస్ స్టార్ టెన్నిస్ రాకెట్‌ను నేలకేసి బాదడం మొదలుపెట్టాడు. పక్కనే కూర్చున్న తన తండ్రి అపోస్టోలోస్ సిట్సిపాస్‌కు ఆ రాకెట్ తగిలింది. కుమారుడి ప్రవర్తన పట్ల అసంతృప్తి చెందిన అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం ప్రేక్షకుల మధ్యలో ఉన్న అతడి తల్లి.. సిట్సిపాస్ దగ్గరకు వచ్చి కొడుకు తలంటింది.