తెలంగాణ

telangana

ETV Bharat / sports

మాజీ నెంబర్ వన్​ షరపోవా రిటర్న్​ - tennis

మాజీ ప్రపంచ నెంబర్ వన్ షరపోవా మళ్లీ రాకెట్ పట్టనుంది. గాయం కారణంగా మూడు నెలల విరామం తర్వాత మల్లోర్కా ఓపెన్​లో ఆడనుంది.

షరపోవా

By

Published : Jun 11, 2019, 8:45 AM IST

కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని మూడు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్న రష్యా క్రీడాకారిణి మళ్లీ రాకెట్ పట్టనుంది. మల్లోర్కా ఓపెన్​లో వైల్డ్​ కార్డ్​ ఎంట్రీతో బరిలోకి దిగనుంది. ఈ ఏడాది జనవరిలో డబ్ల్యూటీఏ సెయింట్ పీటర్స్​బర్గ్ ఓపెన్​ నుంచి వైదొలిగినప్పటి నుంచి షరపోవా ఏ టోర్నీలోనూ ఆడలేదు.

మల్లోర్కా ఓపెన్​ను వింబుల్డన్​కు సన్నాహకంగా భావిస్తారు. ఈ టోర్నమెంట్ జూన్ 17న ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో మాజీ ప్రపంచ నెంబర్​వన్​ క్రీడాకారిణిలు విక్టోరియా అజరెంకా, ఏంజెలిక్ కెర్బర్​లు పాల్గొననున్నారు.

ఇవీ చూడండి.. 'అఫ్గాన్ క్రికెట్​ బోర్డు నాపై కుట్ర చేసింది'

ABOUT THE AUTHOR

...view details