మార్గరెట్ కోర్ట్ (24) పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల రికార్డును అందుకోవాలని తహతహలాడుతున్న సెరెనా విలియమ్స్‌కు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కఠిన డ్రా ఎదురైంది. ఆమె ఆడనున్న పార్శ్వంలో యుఎస్ ఓపెన్ ఛాంపియన్ ఒసాకాతో పాటు గ్రాండ్‌స్లామ్ విజేతలు కెర్బర్, ముగురుజ, వీనస్, ఆండ్రెస్క్యూ ఉన్నారు. పదో సీడ్‌గా బరిలో దిగుతున్న సెరెనా.. తొలి రౌండ్లో లౌరా సిగ్మండ్ (జర్మనీ)తో తలపడనుంది.
ఆస్ట్రేలియన్ ఓపెన్: ఒకే పార్శ్వంలో సెరెనా, ఒసాకా - ఒకే పార్శ్వంలో సెరెనా, ఒసాకా
అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్, ప్రపంచ రెండో ర్యాంకర్ నవోమి ఒసాకా.. సోమవారం ఆరంభమయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఒకే పార్శ్వంలో ఆడబోతున్నారు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల రికార్డును అందుకోవాలని తహతహలాడుతున్న సెరెనా విలియమ్స్‌కు ఆస్ట్రేలియన్ ఓపెన్ కీలకంగా మారింది.
ఒకే పార్శ్వంలో సెరెనా, ఒసాకా
పురుషుల సింగిల్స్‌లో జకోవిచ్, నాదల్ వేర్వేరు పార్శ్వాల్లో ఉన్నారు. 21వ టైటిల్ గెలిచి ఫెదరర్‌ను అధిగమించాలని ఊవ్విళ్లూరుతున్న నాదల్... లాస్లోతో తొలి మ్యాచ్ ఆడబోతున్నాడు. భారత యువ ఆటగాడు సుమిత్ నగాల్... రికార్డాస్ బెరాంకీస్ (లిథుయేనియా)తో తలపడనున్నాడు.