తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆర్జనలో సైనా నంబర్​ 2- సింధుకు దక్కని చోటు - ఆదాయం

ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో టైటిల్స్ ద్వారా డబ్బులు ఆర్జింజిన వారిలో రూ. 25 లక్షలతో సైనా రెండో స్థానంలో నిలిచింది. చెన్ యూఫీ రూ.60లక్షలతో మొదటి స్థానంలో ఉంది.

సైనా నెహ్వాల్

By

Published : Mar 30, 2019, 1:46 PM IST

భారత స్టార్ షట్లర్​ ఆటతో పాటు ఆదాయంలోనూ దూసుకుపోతోంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో టైటిల్స్ ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించిన వారిలో సైనా రెండో స్థానంలో నిలిచింది. ఇండోనేషియా మాస్టర్స్ విజయం, మలేషియా మాస్టర్స్​లో సెమీఫైనలిస్టు, ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్​షిప్​లో క్వార్టర్స్​కు చేరడం లాంటి ప్రదర్శనలతో 36,825 డాలర్లు(రూ. 25 లక్షలపైన) సంపాదించింది.

మహిళల సింగిల్స్​లో సైనా రెండో స్థానంలో ఉండగా ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్ విజేత చెన్ యూఫీ 86,325 డాలర్ల(దాదాపు రూ. 60 లక్షలు)తో అగ్రస్థానంలో ఉంది. ప్రపంచ నెం1 ర్యాంకర్ తైజూ ఇంగ్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. తెలుగమ్మాయి పీవీ సింధు ఆల్ ఇంగ్లండ్ నుంచి తొలి రౌండ్​లోనే నిష్క్రమించినందున ఇండియాఓపెన్​లో సత్తా చాటాలని భావిస్తోంది. సింధు పేరు ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం.

పురుషుల సింగిల్స్​లో కెంటోమెమోటా 94, 550 డాలర్ల(రూ. 65 లక్షలు)తో ప్రథమ స్థానంలో ఉన్నాడు. విక్టర్ అక్సెల్​సన్ 44,150 డాలర్ల(రూ. 30లక్షలు)తో రెండో స్థానంలో ఉన్నాడు. మహిళల డబుల్స్​లో చెన్- జియా జోడి 39,356 డాలర్లు(రూ. 27 లక్షలు), మాయూ- వాకానా జోడి 28,150 డాలర్ల(రూ. 19లక్షలు)తో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. పురుషుల డబుల్స్​లో అహ్సాన్​- సెతియావాన్ జోడి 44,850​(రూ. 31లక్షలు)తో మొదటి స్థానంలో ఉంది.

ABOUT THE AUTHOR

...view details