టెన్నిస్లోఇప్పటికే ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న రోజర్ ఫెదరర్ తాజాగా మరో అరుదైన ఘనత సాధించాడు. టాప్-100లో 1020 వారాల పాటు ఉండి ఆండ్రీ అగస్సీ(1019 వారాలు) పేరిట ఉన్న రికార్డుని బద్దలుకొట్టాడు. 1999లో టాప్-100 లోకి ప్రవేశించాడు ఫెదరర్. 19 ఏళ్ల వయసులో ఏటీపీ టాప్-20లో చోటు దక్కించుకున్నాడు.
టెన్నిస్ దిగ్గజం ఫెదరర్ ఖాతాలో మరో రికార్డు
స్విట్జర్లాండ్ టెన్నిస్ ఆటగాడు రోజర్ ఫెదరర్.. మరో అరుదైన రికార్డు సాధించాడు. అత్యధిక వారాల పాటు టాప్-100లో నిలిచిన టెన్నిస్ ప్లేయర్‌గా ఘనత దక్కించుకున్నాడు.
టెన్నిస్ దిగ్గజం ఫెదరర్ ఖాతాలో మరో రికార్డు
స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెదరర్.. గ్రాండ్‌స్లామ్ రారాజుగా తన పేరును లిఖించుకున్నాడు. 20 సార్లు పురుషుల గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించాడు. 30 సార్లు సెమీఫైనల్ వరకు వెళ్లాడు. అగ్రస్థానంలో 310 వారాల పాటు ఉన్నాడు.
ఇది చదవండి: నొవాక్ నెం.1.. నాలుగో స్థానంలో రోజర్