వింబుల్డన్ అనంతరం మహిళల ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు. టెన్నిస్ ఫెడరేషన్ ప్రకటించిన ఈ ర్యాంకింగ్స్‌లో ఫ్రెంచ్ ఓపెన్ విజేత ఆష్లే బార్టి(అస్ట్రేలియా) అగ్రస్థానాన్ని పదిల పరచుకుంది.
మహిళల టెన్నిస్ ర్యాంకింగ్స్ విడుదల - rankings
మహిళల ర్యాంకింగ్స్‌ను నేడు ప్రకటించింది టెన్నిస్ అసొసియేషన్. ఆస్ట్రేలియా క్రీడాకారిణి ఆష్లే బార్టి తన మొదటి స్థానాన్ని పదిల పరచుకుంది. నొవామి ఒసాకా రెండు, ప్లిస్కోవా మూడో స్థానాల్లో ఉన్నారు.
ఆష్లే బార్టి
ఏడాదిలో ఫ్లేయర్ల ఆటతీరును పరిశీలించి ఇచ్చే ఈ ర్యాంకింగ్స్‌ను వింబుల్డన్ ఫలితాలు ఏ మాత్రం మార్చలేకపోయాయి. ప్లిస్కోవా మూడు, వింబుల్డన్ విజేత హలెప్ నాలుగో స్థానంలో ఉన్నారు. వింబుల్డన్ రన్నరప్ సెరెనా విలియమ్స్ తొమ్మిదో ర్యాంకును సొంతం చేసుకుంది.
- 1. ఆష్లే బార్టి (అస్ట్రేలియా)
- 2. నొవామి ఒసాకా(జపాన్)
- 3. కరోలినా ప్లిస్కోవా(చెక్ రిపబ్లిక్)
- 4. సిమోనా హలెప్(రొమేనియా)
- 5. కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్)
- 6. పెట్రా క్విటోవా (సెజ్)
- 7. ఎలినా స్విటోలినా (ఉక్రెయిన్)
- 8. స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)
- 9. సెరెనా విలియమ్స్ (అమెరికా)
- 10. ఆర్యనా సబాలెంకా (బెలారస్)
ఇది చదవండి: అత్యుత్తమ క్రికెట్ జట్టు సిద్ధం చేస్తున్న ప్రధాని!