ఆదివారం ప్రారంభమైన ఫ్రెంచ్ ఓపెన్‌లో దాదాపు నాలుగేళ్ల తర్వాత అడుగుపెట్టాడు టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్. ఆడిన తొలి మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేశాడు. ఇటలీ ఆటగాడు లోరెంజో సొనెగోపై 6-2, 6-4, 6-4 తేడాతో గెలుపొందాడు. గ్రాండ్‌స్లామ్‌లో ఫెదరర్ తొలి రౌండ్ గెలవడమిది 60వ సారి.
"తొలి రౌండ్లో గెలిచాను. నా గుండె క్రేజీగా శబ్దం చేస్తోంది. ఈ కోర్టులో ఆడటం గౌరవంగా భావిస్తున్నా. తర్వాత మ్యాచ్ ఇక్కడే ఆడతానని అనుకుంటున్నా." -రోజర్ ఫెదరర్, టెన్నిస్ ఆటగాడు