తెలంగాణ

telangana

ETV Bharat / sports

Australian Open: ఆస్ట్రేలియన్​ ఓపెన్​కు జకోవిచ్ దూరం?

ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో (Australian Open) తాను పాల్గొనకపోవచ్చని ప్రపంచ నంబర్‌ వన్‌ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌ తెలిపాడు. మెల్​బోర్న్​లో జరగనున్న ఈ గ్రాండ్​స్లామ్​కు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఈ మేరకు జకోవిచ్ స్పందించాడు.

Novak Djokovic australia open
ఆస్ట్రేలియన్​ ఓపెన్

By

Published : Oct 19, 2021, 10:27 AM IST

వచ్చే ఏడాది జరగనున్న ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో (Australian Open ) తాను పాల్గొనకపోవచ్చని ప్రపంచ నంబర్‌ వన్‌ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌ తెలిపాడు. తాను కరోనా టీకా వేయించుకున్నానా? లేదా చెప్పడానికి ఎప్పటిలాగే నిరాకరించాడు. వచ్చే ఏడాది గ్రాండ్​స్లామ్​ మెల్​బోర్న్​లో జరగనుంది. అథ్లెట్లందరికి వ్యాక్సినేషన్ తప్పనిసరి చేశారు నిర్వాహకులు. వ్యాక్సిన్ వేయించుకోని వారికి వీసాలు మంజూరు చేయబోమని ఆస్ట్రేలియా అధికార వర్గాలు తెలిపాయి.

"పరిస్థితులు ఇలాగే ఉంటే.. నేను మెల్​బోర్న్​కు వెళతానో? లేదో? తెలియదు. వ్యాక్సిన్ వేసుకున్నానా? లేదా? నేను చెప్పను. అది నా వ్యక్తిగతం. ఓ వ్యక్తిని ప్రశ్నలు అడిగి.. వారిని అంచనా వేయడం ఈ రోజుల్లో స్వేచ్ఛగా భావిస్తున్నారు. నాకు ఆస్ట్రేలియా గ్రాండ్​స్లామ్​ అంటే చాలా ఇష్టం. ఈ ఏడాది కూడా నిబంధనలు ఎప్పటిలాగే ఉంటాయని అనుకుంటున్నా. మరీ ఎక్కువ మార్పులు ఉంటే.. నేనే ఆడటం సందేహమే."

ఇప్పటివరకు జకోవిచ్​ తొమ్మిదిసార్లు ఆస్ట్రేలియా గ్రాండ్​స్లామ్​ని సొంతం చేసుకున్నాడు. ఇటీవల జరిగిన యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో నొవాక్​ జకోవిచ్(Novak Djokovic US Open) ఓటమిపాలయ్యాడు​. ఈ ఏడాది 'క్యాలెండర్‌ స్లామ్‌' సాధించి చరిత్ర సృష్టించాలన్న అతని కలకు మెద్వెదెవ్​ అడ్డుకట్ట వేశాడు.

ఇదీ చదవండి:T20 World Cup: ఆస్ట్రేలియా నిరీక్షణ ముగిసేనా?

ABOUT THE AUTHOR

...view details