తెలంగాణ

telangana

ETV Bharat / sports

మరోసారి వార్తల్లో టెన్నిస్​ ఆటగాడు కిర్గియోస్​ - నిక్ కిర్గియోస్

అండర్​ ఆర్మ్​షాట్​ ఆడి విమర్శలపాలైన నిక్​ కిర్గియోస్​, రెగ్యులర్ టెన్నిస్ షాట్లు ఆడకుండా మరోసారి వార్తల్లోకెక్కాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

నిక్ కిర్గియోస్

By

Published : Mar 27, 2019, 12:09 PM IST

నిక్ కిర్గియోస్
నిక్ కిర్గియోస్.. అండర్ ఆర్మ్ షాట్​తో వివాదాస్పదమైన ఈ ఆసీస్ టెన్నిస్​ ఆటగాడు మరోసారి తన ఆటతీరుతో వార్తల్లోకెక్కాడు. మయామి ఓపెన్​లో​ జరిగిన మరో మ్యాచ్​లో రెగ్యులర్ టెన్నిస్​ షాట్లు ఆడకుండా విభిన్నంగా ప్రయత్నించాడు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ప్రత్యర్థి బోర్నా ఎరిక్ చేతిలో ఓడిపోయాడు కిర్గియోస్. ఎరిక్​ 4-6, 6-3, 6-2 తేడాతో నిక్​ను చిత్తు చేశాడు.

అసహజ శైలిలో ఆడిన నిక్​... ప్రేక్షకుల నుంచి మాత్రం అభినందనలు అందుకున్నాడు. నిక్ ఆ షాట్ అడుతున్నప్పుడు స్టేడియంలో అభిమానులు కేరింతలు కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

ABOUT THE AUTHOR

...view details