తెలంగాణ

telangana

ETV Bharat / sports

యూఎస్ ఓపెన్​ రెండో రౌండ్​లో భారత ఆటగాడు - tennnis

భారత యువ టెన్నిస్​ క్రీడాకారుడు సుమిత్​ నగల్​ అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ప్రఖ్యాత గ్రాండ్​స్లామ్​ టోర్నీ యూఎస్​ ఓపెన్ క్వాలిఫయింగ్​ ఈవెంట్​​ తొలి రౌండులో గెలిచాడు. టాట్సమ్​ ఇటో(జపాన్​)పై 7-6, 6-2 తేడాతో విజయం సాధించాడు.

సుమిత్ నాగల్

By

Published : Aug 21, 2019, 2:44 PM IST

Updated : Sep 27, 2019, 6:54 PM IST

ప్రతిష్టాత్మక యూఎస్​ ఓపెన్​ క్వాలిఫయింగ్​ ఈవెంట్​లో సత్తా చాటాడు భారత టెన్సిస్​ ప్లేయర్​ సుమిత్​ నగల్​. మంగళవారం జరిగిన మ్యాచ్​లో టాట్సమ్​ ఇటో(జపాన్​)పై వరుస సెట్లలో విజయం సాధించాడు. కెరీర్​ 190వ ర్యాంక్​లో ఉన్న సుమిత్​... 7-6, 6-2 తేడాతో వరుస సెట్లలో 133వ ర్యాంక్​ ప్రత్యర్థిని ఓడించాడు. వీరిద్దరి మధ్య గంట 52 నిమిషాల పాటు మ్యాచ్​ హోరాహోరీగా సాగింది.

గతేడాది ఆస్ట్రేలియా, ఫ్రెంచ్​ ఓపెన్​ సహా వింబుల్డన్​ ఛాంపినయన్​షిప్​లలో ఆడిన సుమిత్​.. ఒక్క రౌండ్​లోనూ గెలవలేకపోయాడు. యూఎస్​ ఓపెన్ తర్వతి మ్యాచ్​లో పీటర్​ పొలాన్సీ(కెనడా)తో తలపడనున్నాడీ హరియాణా స్టార్​ ప్లేయర్​.

మహిళలు సింగిల్స్​ క్వాలిఫయింగ్​ ఈవెంట్​లో రెండో రౌండ్​లో అంకిత రైనా(భారత్​) , డెనిసా అలెర్టోవా (చెక్​ రిపబ్లిక్​) మధ్య మ్యాచ్​ జరగాల్సి ఉంది.

ఇది చదవండి: ఒలింపిక్ టెస్టు ఈవెంట్ విజేత భారత్

Last Updated : Sep 27, 2019, 6:54 PM IST

ABOUT THE AUTHOR

...view details