కెరీర్లో 12వ సారి బార్సిలోనా ఓపెన్ ఫైనల్లోకి ప్రవేశించాడు స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్. నేడు (ఆదివారం) జరిగే ఫైనల్లో గ్రీక్ టెన్నిస్ స్టార్ స్టెఫానోస్ సిట్సిపాస్‌తో తలపడనున్నాడు. టాప్ సీడ్ నాదల్.. ఇప్పటికే ఫైనల్ చేరిన 11 సార్లు బార్సిలోనా ఓపెన్‌లో ఛాంపియన్‌గా నిలిచాడు.
సెమీఫైనల్లో స్పెయిన్‌కు చెందిన కరేనో బుస్టాను 6-3, 6-2తో మట్టికరిపించి.. నాదల్ టైటిల్ పోరుకు దూసుకెళ్లాడు. ఇటలీకి చెందిన జన్నిక్ సిన్నర్‌పై 6-3, 6-3 తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరాడు యువ సంచలనం సిట్సిపాస్.