Nadal on Djokovic: ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొనేందుకు వెళ్లిన నొవాక్ జకోవిచ్‌ను మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్ట్‌లో ఎనిమిది గంటలపాటు నిలిపివేసి వీసాను రద్దు చేశారు అక్కడి అధికారులు. కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించి తగిన ఆధారాలు సమర్పించని కారణంగా జకోవిచ్‌ను నిలిపివేసినట్లు ఆస్ట్రేలియా బోర్డర్ ఫోర్స్ తెలిపింది. జకోవిచ్ సంఘటనపై మాజీ నంబర్‌వన్ రఫేల్ నాదల్ స్పందించాడు. కొవిడ్ వైరస్‌కు వ్యాక్సిన్ వేయించుకోకపోతే పర్యవసనాలను ఎదుర్కోక తప్పదని పేర్కొన్నాడు. గతంలో కొవిడ్ బారిన పడిన నాదల్.. 'నాకు వ్యాక్సినేషన్ మీద పూర్తి నమ్మకం ఉంది. కరోనా మహమ్మారితో చాలా మంది ప్రజలు మృత్యువాత పడ్డారు" అని వ్యాఖ్యానించాడు.
జకోవిచ్‌ను ఉద్దేశించి నాదల్ మాట్లాడుతూ.. "వ్యాక్సిన్ వేయించుకుంటే ఆస్ట్రేలియా ఓపెన్‌తో సహా ప్రపంచంలో ఎక్కడైనా ఆడవచ్చు. నా అభిప్రాయం ప్రకారం నిబంధనలు సరిగా పాటించకపోవడం వల్లే ప్రపంచమంతా ఇబ్బందుల్లో పడిందేమో. అయితే రిస్క్ గురించి జకోవిచ్‌కు తెలుసు. స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోగలడు. అదే సమయంలో టోర్నీ నిర్వాహకులు కఠినంగా ఉంటారు. టీకా తీసుకోకపోతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలానే జకో విషయంలో జరిగిన సంఘటనలూ నాకు నచ్చలేదు. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో గత కొన్నినెలలుగా తలెత్తిన పరిస్థితులు కూడా జకోవిచ్‌కు తెలుసు. కాబట్టి వాటన్నింటిని పరిగణనలోకి తీసుకుని అతడే నిర్ణయం తీసుకోవాలి" అని సూచించాడు.
ఇదీ చదవండి: