తెలంగాణ

telangana

By

Published : Nov 18, 2019, 9:07 PM IST

ETV Bharat / sports

ఫెదరర్, జకోవిచ్ సరసన స్పెయిన్ బుల్

స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్.. ఈ ఏడాదిని అగ్రస్థానంతో ముగించాడు. వరుసగా ఐదో సంవత్సరం ఈ ఘనత సాధించి ప్రముఖ ప్లేయర్స్ ఫెదరర్, జకోవిచ్ సరసన చేరాడు.

నాదల్

స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్.. వరుసగా ఐదో ఏడాది అగ్రస్థానంతో కాలెండర్ ఇయర్​ను ముగించాడు. తాజాగా ఏటీపీ విడుదల చేసిన ర్యాంకింగ్స్​లో నంబర్​వన్ స్థానంతో ఈ సంవత్సరాన్ని పూర్తి చేశాడు.

ఇటీవలే జరిగిన 'ఏటీపీ ఫైనల్స్'​లో గ్రూప్ స్టేజ్ దాటని నాదల్​కు జకోవిచ్​ వైఫల్యం కలిసొచ్చింది. ఫలితంగా 9,985 పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. వరుసగా ఐదో ఏడాది అగ్రస్థానంతో ఏడాదిని ముగించాడు. ఫెదరర్, జకోవిచ్ సరసన నిలిచాడు. మాజీ టెన్నిస్ దిగ్గజం పీట్ సంప్రాస్ ఆరుసార్లు ఈ ఘనత సాధించి, వీరికంటే ముందున్నాడు.

ఈ ఏడాది.. నాదల్(ఫ్రెంచ్, యూఎస్​ ఓపెన్), జకోవిచ్(ఆస్ట్రేలియా, వింబుల్డన్ ఓపెన్​) చెరో రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచారు.

టెన్నిస్ స్టార్ ఫెదరర్.. ఈ ఏడాది ఒక్క గ్రాండ్ స్లామ్​ గెలవలేకపోయాడు. ఫలితంగా మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. జకోవిచ్ రెండో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రియా ఆటగాడు డొమినిక్ థీమ్ నాలుగో ర్యాంకు కైవసం చేసుకున్నాడు.

ర్యాంక్​ల వారిగా జాబితా

1 రఫెల్ నాదల్ (స్పెయిన్) 9,985
2 నొవాక్ జకోవిచ్ (సెర్బియా) 9,145
3 రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) 6,590
4 డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 5,825
5 మెద్వదేవ్ (రష్యా) 5,705

ఇవీ చూడండి..'సవ్యసాచి' బౌలింగ్​కు నెటిజన్ల ఫిదా!

ABOUT THE AUTHOR

...view details