అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్(ఏటీపీ) సోమవారం టెన్నిస్ ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఇందులో పురుషుల సింగిల్స్ విభాగంలో నొవాక్ జకోవిచ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. నాదల్ రెండో స్థానంలో ఉన్నాడు.
బ్రిటీష్ స్టార్ ఆండీ ముర్రే 214 పైచిలుకు స్థానాలు మెరుగుపరుచుకుని 289వ ర్యాంకుకు చేరాడు. ఇటీవల ప్రదర్శన లేమితో వెనుకంజలో ఉన్న ముర్రే.. చైనా ఓపెన్ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. ఈ టోర్నీకి ముందు 503వ స్థానంలో ఉన్నాడు.
స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ మూడో స్థానంలో ఉన్నాడు. రష్యాకు చెందిన మెద్వదేవ్ నాలుగో స్థానంలో ఉండగా.. ఆస్ట్రియా ఆటగాడు డొమనీస్ థీమ్ 5వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.