పారిస్ వేదికగా జరుగుతోన్న ఫ్రెంచ్ ఓపెన్(French Open)లో పురుషుల డబుల్స్‌కు చెందిన ఇద్దరు టెన్నిస్ ఆటగాళ్లకు కరోనా పాజిటివ్(Corona Postive)గా తేలింది. ఈ విషయాన్ని టోర్నీ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. వైరస్ సోకిన కారణంగా వారిద్దరిని టోర్నీ నుంచి తప్పించినట్లు తెలిపారు.
ఫ్రెంచ్ ఓపెన్‌లో కరోనా కలకలం - ఫ్రెంచ్ ఓపెన్‌లో కరోనా
ఫ్రెంచ్ ఓపెన్(French Open)లో పాల్గొన్న పురుషుల డబుల్స్ ఆటగాళ్లలో ఇద్దరికి కొవిడ్-19(Covid-19) సోకింది. అయితే వైరస్ సోకిన ప్లేయర్లను టోర్నీ నుంచి తొలగిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
French Open: ఇద్దరు టెన్నిస్ ఆటగాళ్లకు కరోనా
కరోనా సోకిన ఇద్దరు ఆటగాళ్లను ప్రస్తుతం క్వారంటైన్‌కు తరలించినట్లు ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు వెల్లడించారు. టోర్నీలోని క్వాలిఫయిర్ రౌండ్స్ మొదలైన మే 24 నుంచి ఇప్పటివరకు 2,446 కరోనా పరీక్షలు చేయగా వీరిద్దరికే కరోనా సోకినట్లు ఫ్రెంచ్ టెన్నిస్ ఫెడరేషన్(french tennis federation) వెల్లడించింది.
ఇదీ చూడండి:French Open: మూడో రౌండ్లో సెరెనా, జ్వెరెవ్