17వ సీడ్ మారియా సక్కారి, ఫ్రెంచ్ ఓపెన్‌లో అదరగొట్టింది. ప్రత్యర్థులను చిత్తు చేస్తూ నాలుగో రౌండ్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో దాదాపు మూడు గంటల పాటు సాగిన మ్యాచ్‌లో ఎలీస్ మెర్టెన్స్(బెల్జియమ్)ను 7-5, 6-7(2), 6-2 తేడాతో ఓడించింది. కెరీర్లో తొలిసారి ఆమె నాలుగో రౌండ్‌కు చేరుకుంది. ప్రీక్వార్టర్స్‌లో సోఫియా కెనిన్(అమెరికా)తో తలపడనుంది.
French Open: ప్రీక్వార్టర్స్‌కు మారియా, కోకో గాఫ్ - నెం.24సీడ్ కోకో గాఫ్
ఫ్రెంచ్ ఓపెన్(French Open)లో ఆదివారం జరిగిన పోటీల్లో మారియా సక్కారి(గ్రీస్), సోఫియా, కోకో గాఫ్ అదరగొట్టారు. ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించి ప్రీక్వార్టర్స్‌కు చేరుకున్నారు.
కోకో గాఫ్
ఈ మూడో రౌండ్లో నెం.4సీడ్ సోఫియా 4-6,6-1,6-4తేడాతో జెస్సికా పెగులాను ఓడించగా.. నెం.24సీడ్ కోకో గాఫ్(యూఎస్)3-6, 6-0, 6-1తేడాతో మాగ్డా లినెట్టి(పొలాండ్)ను మట్టికరిపించింది. కోకో కూడా నాలుగో రౌండ్‌కు చేరడం ఇదే తొలిసారి. దీంతో వీరిద్దరూ కూడా ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టేశారు.
ఇదీ చూడండి French Open: గాయంతో ఫెదరర్ ఔట్!