రెండుసార్లు వింబుల్డన్ ఛాంపియన్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) జోరు మీదుంది. అలవోకగా ఆమె ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఏడో సీడ్ క్విటోవా 6-2, 6-4తో జాంగ్ షుయ్ (చైనా)ను ఓడించింది. 2012 తర్వాత రొలాండ్ గారోస్‌లో ఆమె క్వార్టర్స్ చేరడం ఇదే తొలిసారి. క్వార్టర్స్‌లో అన్‌సీడెడ్ లారా సిగ్మండ్ (జర్మనీ)తో క్విటోవా తలపడనుంది. సిగ్మండ్ 7-5, 6-2తో పౌలా బదోసా (స్పెయిన్)ను ఓడించింది. రెండో రౌండ్లో స్లోన్ స్టీఫెన్స్‌కు, మూడో రౌండ్లో జెలెనా వొస్టాపెంకోకు షాకిచ్చిన బదోసా.. ఈ మ్యాచ్‌లో ఆ జోరు చూపించలేకపోయింది. కెనిన్ (అమెరికా) 2-6, 6-2, 6-1తో ఫెర్రో (ఫ్రాన్స్)పై గెలిచి క్వార్టర్స్ చేరింది.
ఎనిమిదేళ్ల తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్స్‌కు.. - ఫ్రెంచ్ ఓపెన్
రెండుసార్లు వింబుల్డన్ ఛాంపియన్ పెట్రా క్విటోవా ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో 6-2, 6-4తో జాంగ్ షుయ్ (చైనా)ను ఓడించింది. కాగా, టాప్‌సీడ్ జకోవిచ్ క్వార్టర్‌ఫైనల్ చేరాడు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఈ సెర్బియా స్టార్ 6-4, 6-3, 6-3తో రష్యా యువ కెరటం కచానోవ్‌పై విజయం సాధించాడు.
జకో ముందుకు: టాప్‌సీడ్ జకోవిచ్ క్వార్టర్‌ఫైనల్ చేరాడు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఈ సెర్బియా స్టార్ 6-4, 6-3, 6-3తో రష్యా యువ కెరటం కచానోవ్‌పై విజయం సాధించాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో క్వార్టర్స్ దశకు రావడం జకోకు ఇది 47వ సారి. అత్యధికసార్లు క్వార్టర్స్ చేరిన ఆటగాళ్ల జాబితాలో ఫెదరర్ (57) తర్వాత స్థానం అతనిదే. గ్రీస్ కుర్రాడు సిట్సిపాస్ కూడా క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. ప్రిక్వార్టర్స్‌లో ఈ అయిదో సీడ్ 6-3, 7-6 (11-9), 6-2తో దిమిత్రోవ్ (బల్గేరియా)ను ఓడించాడు. మరో ప్రిక్వార్టర్స్‌లో రష్యా కుర్రాడు రుబ్‌లెవ్ కష్టపడి గెలిచాడు. అతను 6-7 (4-7), 7-5, 6-4, 7-6 (7-3)తో ఫుసోవిస్ (హంగేరి)పై గెలిచాడు.బాలుర సింగిల్స్‌లో భారత కుర్రాడు దేవ్ జావియా తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. అతను 4-6, 6-3, 3-6తో గిబౌదో (ఫ్రాన్స్) చేతిలో పరాజయంపాలయ్యాడు.