తెలంగాణ

telangana

ETV Bharat / sports

శిఖరం నుంచి పాతాళానికి: టెన్నిస్​కు షరపోవా గుడ్​బై

ప్రపంచ టెన్నిస్​ అభిమానులకు గుండెకోత. దాదాపు 19 ఏళ్లు ఈ క్రీడలో రాణించడమే కాకుండా తనదైన అందంతో ఎందరినో మంత్రముగ్ధుల్ని చేసిన మరియా షరపోవా.. ఆటకు నేడు వీడ్కోలు పలికింది.

Maria Sharapova
టెన్నిస్​కు మరియా షరపోవా గుడ్​బై

By

Published : Feb 26, 2020, 7:23 PM IST

Updated : Mar 2, 2020, 4:10 PM IST

ఐదుసార్లు గ్రాండ్​స్లామ్​ విజేత మరియా షరపోవా.. టెన్నిస్​కు రిటైర్మెంట్​ ప్రకటించింది. ఈ మేరకు నేడు ప్రకటన చేసింది. "టెన్నిస్​ నీకు గుడ్​బై చెప్తున్నా" అని భావోద్వేగంతో చెప్పింది. 19 ఏళ్లు ఈ క్రీడలో కొనసాగిన ఈమె.. జీవితంలో మరో మెట్టు ఎక్కేందుకు ప్రయత్నిస్తానంది.

చిన్న వయసులోనే రాకెట్​

17 ఏళ్ల వయసులో రాకెట్​ పట్టిన షరపోవా... 2004లో తొలి వింబుల్డన్​ గెలిచింది. ఆ తర్వాత ఫ్రెంచ్​ ఓపెన్​, ఆస్ట్రేలియా ఓపెన్, అమెరికా ఓపెన్​ టైటిళ్లనూ గెలుచుకుంది. కెరీర్​లో ఐదుసార్లు గ్రాండ్​స్లామ్​​తో గెలవడం సహా ప్రపంచ నంబర్​వన్​ ర్యాంక్​లోనూ కొనసాగింది.

17 ఏళ్ల వయసులో షరపోవా

డోపింగ్​ రాత మార్చేసింది

2016లో డోపింగ్​ టెస్టులో విఫలమైన రష్యన్ క్రీడాకారిణి​ షరపోవా.. దాదాపు 15 నెలలు నిషేధం ఎదుర్కొంది​. ఆ ఘటన తన కెరీర్​ను మార్చేసింది. దానికి తోడు భుజం గాయంతోనూ చాలా ఇబ్బందులు పడింది.

టెన్నిస్​ క్వీన్​ షరపోవా

నిషేధం తర్వాత ఒక్క మ్యాచ్​లో మాత్రమే క్వార్టర్స్​ వరకు రాగలిగింది. చివరగా ఆస్ట్రేలియా ఓపెన్​-2020లో తలపడిన ఈ భామ.. డొన్నా వెకిక్​ చేతిలో 6-3, 6-4 తేడాతో ఓడిపోయింది. ప్రపంచ 373వ ర్యాంక్​తో కెరీర్​ను ముగించింది.

షరపోవా

టెన్నిస్​లో ఎన్నో విజయాలు అందుకున్న షరపోవా... కెరీర్​ చివర్లో దారణమైన ఓటములతో చతికిలపడింది. వరసగా నాలుగు గ్రాండ్​స్లామ్​ల్లోనూ నిరాశపరిచింది. తనకన్నా తక్కువ ర్యాంకర్ల చేతిలో ఓడి విమర్శలు ఎదుర్కొంది. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఈమె​... తాజాగా తన 32వ ఏట ప్రొఫెషనల్​ టెన్నిస్​కు వీడ్కోలు పలికింది.

Last Updated : Mar 2, 2020, 4:10 PM IST

ABOUT THE AUTHOR

...view details