13 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్.. ప్రపంచ నెంబర్ 1 నొవాక్ జొకోవిచ్‌ను ఢీకొట్టనున్నాడు. ప్రస్తుతం ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లో వీరిద్దరూ తలపడనున్నారు.
క్వార్టర్ ఫైనల్లో తమ తమ మ్యాచ్‌ల్లో గెలిచి సెమీస్‌కు చేరుకున్నారు. ఇటలీకి చెందిన బెరిటినీని జొకోవిచ్ ఓడించగా, అర్జెంటీనాకు చెందిన ష్వార్జ్‌మన్‌పై విజయం సాధించి, 14వ సారి సెమీస్‌లోకి అడుగుపెట్టాడు రఫా.
ఇప్పటికే తమ కెరీర్లో 58 సార్లు తలపడిన జకో, నాదల్.. 29-28 విజయాలతో ఉన్నారు.