ఫ్రెంచ్ ఓపెన్‌లో(French Open) నెం.24సీడ్ కోకో గాఫ్(యూఎస్) అదరగొట్టింది. ప్రత్యర్థులను చిత్తు చేస్తూ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. గత 15 ఏళ్లలో ఈ రౌండ్‌కు చేరుకున్న అతితక్కువ వయసుగల క్రీడాకారిణిగా(17ఏళ్లు) ఘనత సాధించింది. ఈ రౌండ్‌కు చేరుకోవడంపై ఆమె హర్షం వ్యక్తం చేసింది.
French Open: క్వార్టర్స్‌లో కోకో.. సరికొత్త రికార్డు - కోకో గాఫ్ క్వార్టర్ ఫైనల్్
ఫ్రెంచ్ ఓపెన్‌లో(French Open) భాగంగా సోమవారం జరిగిన పోటీల్లో కోకో గాఫ్(యూఎస్) నెగ్గి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరింది. ఈ రౌండ్‌కు చేరుకున్న పిన్నవయస్కురాలిగా(17ఏళ్లు) రికార్డుకెక్కింది.
కోకో గాఫ్
సోమవారం జరిగిన పోటీల్లో భాగంగా తునిషియా ఆన్స్ జాబర్ (Tunisia's Ons Jabeur)ను 6-3, 6-1తేడాతో మట్టికరిపించింది. ఈ పోరు 53నిమిషాల పాటు సాగింది. క్వార్టర్ ఫైనల్స్‌లో బార్బొరా క్రెజ్సికోవా(Barbora Krejcikova)తో తలపడనుంది.
Last Updated : Jun 8, 2021, 6:44 AM IST