తెలంగాణ

telangana

ETV Bharat / sports

పాంచ్​ పటాకా: దుబాయ్​ ఛాంపియన్​షిప్​ విజేత జకోవిచ్

దుబాయ్​ టెన్నిస్​ ఛాంపియన్​షిప్​ టైటిల్​ను తాజాగా కైవసం చేసుకున్నాడు సెర్బియా స్టార్​ నొవాక్​ జకోవిచ్. ఈ టోర్నీలో ఐదోసారి ఛాంపియన్​గా అవతరించాడు. శనివారం జరిగిన ఫైనల్​​ ​పోరులో 6-3, 6-4 తేడాతో గ్రీస్​ ప్లేయర్​ స్టెఫానోస్​ సిట్సిపాస్​ను​ ఓడించాడు.

Djokovic beats Tsitsipas to win his 5th Dubai Championships title
5వ సారి దుబాయ్​ ఛాంపియన్​షిప్​ టైటిల్​

By

Published : Mar 1, 2020, 11:12 AM IST

Updated : Mar 3, 2020, 1:12 AM IST

ప్రపంచ నంబర్​వన్​ టెన్నిస్​ క్రీడాకారుడు నోవాక్​ జకోవిచ్​... దుబాయ్​ ఛాంపియన్​షిప్​లో విజేతగా నిలిచాడు. ఈ టోర్నీలో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నాడు. దుబాయ్​ సెంట్రల్​ కోర్టు వేదికగా శనివారం జరిగిన తుది పోరులో 6-3, 6-4 తేడాతో గ్రీస్​ ప్రేయర్​ స్టెఫానోస్​ సిట్సిపాస్​ను ఓడించాడు. ఫలితంగా కెరీర్​లో ఐదోసారి ఈ ఛాంపియన్​షిప్​ టైటిల్​ను ముద్దాదాడు.

జకో- సిట్సిపాస్​ మధ్య తుది పోరు 79 నిమిషాల్లో ముగిసింది​. ఈ గెలుపుతో తన కెరీర్​లో 79వ టైటిల్​ చేరింది. అంతేకాకుండా స్టెఫానోస్​తో ఆడిన 8 మ్యాచ్​ల్లోనూ ఇతడే పైచేయి సాధించాడు.

ఐదేళ్లుగా టాపర్​..

దాదాపు ఐదేళ్లుగా ప్రపంచ టెన్నిస్​ ర్యాంకింగ్స్​లో అగ్ర స్థానంలోనే కొనసాగుతున్నాడు జకో. 2019 నుంచి ఈ వీరుడు 21మ్యాచ్​లు ఆడగా అన్నింట్లోనూ గెలిచాడు. ఈ సీజన్​లో జరిగిన 18 మ్యాచ్​ల్లోనూ ఇతడే విజేత. ఈ ఏడాది ఇప్పటికే ఏటీపీ కప్​, 8వ ఆస్ట్రేలియన్​ ఓపెన్​ టైటిల్​ ఖాతాలో వేసుకున్నాడు.

జకోవిచ్ గెలుపు బాట

దుబాయ్​ ప్రభుత్వం గోల్డెన్​ వీసా...

దుబాయ్​ ఛాంపియన్​షిప్​ నెగ్గిన ఈ సెర్బియా ప్లేయర్​ జకోవిచ్​కు... ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్​ వీసాను అందించింది అక్కడి​ ప్రభుత్వం. దీని ద్వారా ఆ దేశ పౌరుడిగా 10 ఏళ్లు నివాసముండేందుకు వీలుంటుంది. గతేదాడి దుబాయ్​ ప్రధాని షేక్​ మహ్మద్​ బిన్​ రషీద్..ఈ వీసా​ ప్రవేశపెట్టారు. ప్రముఖ వ్యాపారవేత్తలు, ప్రముఖులు, వారి కుటుంబాలకు ఈ వీసాను విడతల వారిగా మంజూరు చేస్తోంది ఆ దేశ ప్రభుత్వం. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్​బాల్​ ప్లేయర్​ క్రిస్టియానో రొనాల్డొ గతంలో ఈ వీసాను అందుకున్నాడు.

దుబాయ్​ ఛాంపియన్​షిప్​ విజేత జకోవిచ్

ఇదీ చూడండి.. తొలి ఇన్నింగ్స్​లో భారత్​ 242 ఆలౌట్​.. కివీస్​ 63/0

Last Updated : Mar 3, 2020, 1:12 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details