ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి విక్టోరియా అజరెంకా మాతృమూర్తులను ఉద్దేశించి కీలక సందేశాన్నిచ్చింది. సెరెనా విలియన్స్, తన లాంటి తల్లుల ప్రదర్శన.. ఎంతో మంది మహిళలకు తమ కలలను నెరవేర్చుకోవడానికి ప్రేరణగా నిలుస్తుందని చెప్పింది.
యూఎస్ ఓపెన్‌లో అజరెంకా 1-6, 6-3, 6-3తో విలియన్స్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకున్న తొలి మాతృమూర్తులుగా వీరిద్దరు నిలిచారు.