ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నవోమి ఒసాకా చరిత్ర సృష్టించింది. మెల్బోర్న్ వేదికగా శనివారం జరిగిన ఫైనల్లో జెన్నిఫర్ బ్రాడీపై ఒసాకా గెలుపొందింది. 6-4, 6-3 తేడాతో వరుస సెట్లలో బ్రాడీని చిత్తు చేసింది.
ఆస్ట్రేలియన్ ఓపెన్: మహిళల సింగిల్స్ విజేత ఒసాకా - australian open final wins osaka
ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్‌గా జపాన్ టెన్నిస్ స్టార్ నవోమి ఒసాకా నిలిచింది. ఫైనల్లో అమెరికా ప్లేయర్ జెన్నిఫర్ బ్రాడీపై వరుస సెట్లలో విజయం సాధించింది. తాజా టైటిల్‌తో మొత్తం గ్రాండ్‌స్లామ్‌ల సంఖ్యను నాలుగుకు పెంచుకుంది ఒసాకా.
ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్‌గా ఒసాకా
ఇప్పటికే మూడు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన ఈ జపాన్ స్టార్ ప్లేయర్.. తాజాగా నాలుగో టైటిల్‌ను నెగ్గింది. ఆమె ఖాతాలో ఇప్పుడు రెండు యూఎస్ ఓపెన్(2018,2020), రెండు ఆస్ట్రేలియన్ ఓపెన్( 2019, 2021) టైటిళ్లు ఉన్నాయి.
ఇదీ చదవండి:దిల్లీ విమానాశ్రయంలో మనుబాకర్‌కు అవమానం!
Last Updated : Feb 20, 2021, 3:55 PM IST