ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కరోనా కేసులు వచ్చాయి. టోర్నీలో భాగస్వామ్యమైన ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని టోర్నీ నిర్వాహణాధికారి ఒకరు తెలిపారు. వారి వివరాలను మాత్రం వెల్లడించలేదు.
ఇటీవల పూర్తయిన ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వాలిఫయర్స్‌లో అర్హత సాధించిన ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బంది.. శుక్రవారం ఉదయం ప్రత్యేక విమానంలో అతిథ్య దేశానికి చేరుకున్నారు. వీరిందరికీ అక్కడ చేసిన కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఇద్దరికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతో ఆ విమానంలో ప్రయాణం చేసిన మిగతావారందరినీ 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలోకి పంపించారు నిర్వహకులు. ఫిబ్రవరి 8 నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రారంభం కానుంది.