ఫ్రెంచ్ ఓపెన్ విజేత ఆష్లే బార్టీ వింబుల్డన్ టోర్నీలో శుభారంభం చేసింది. తొలి రౌండ్లో చైనాకు చెందిన జంగ్‌పై సులభంగా నెగ్గి రెండో రౌండ్‌కు చేరుకుంది. మహిళల సింగిల్స్ విభాగంలో 6-4, 6-2 తేడాతో విజయం సాధించింది.
వింబుల్డన్‌లో శుభారంభం చేసిన బార్టీ - barty
వింబుల్డన్‌లో ఫ్రెంచ్ ఓపెన్ విజేత ఆష్లే బార్టీ తొలిరౌండ్లో అలవోకగా నెగ్గింది. చైనాకు చెందిన జంగ్‌పై 6-4, 6-2 తేడాతో విజయం సాధించింది.
బార్టీ
రెండో రౌండ్లో అమెరికాకు చెందిన లోరెన్తో తలపడనుంది ఈ ఆసీస్ క్రీడాకారిణి.
పురుషుల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్ నిషికోరి(జపాన్) బ్రెజిల్‌కు చెందిన మాంటెరియోపై గెలిచాడు. మరో మ్యాచ్‌లో నిక్ కిర్గియోస్(ఆసీస్) తమ దేశానికే చెందిన థాంప్సన్పై నెగ్గాడు. ఇంకో మ్యాచ్‌లో ఐదో సీడ్ డొమనిక్ థీమ్(ఆస్ట్రియా) అమెరికాకు చెందిన క్వెర్రీ చేతిలో పరాజయం చెందాడు.