అమెరికా టెన్నిస్ స్టార్ ప్లేయర్ సెరెనా విలియమ్స్.. ఈ ఏడాది యూఎస్ ఓపెన్‌లో పాల్గొనేందుకు సిద్ధమైంది. బుధవారం యూఎస్ టెన్నిస్ అసోసియేషన్ నిర్వహించిన ఓ క్రీడాకార్యక్రమంలో పాల్గొన్న ఈమె.. తిరిగి కోర్డులో దిగేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని చెప్పింది. ఈ క్రీడాకారిణి కెరీర్లో 23 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్లతో పాటు యూఎస్ ఓపెన్ ట్రోఫీని ఆరుసార్లు సొంతం చేసుకుంది.
75 ఏళ్ల తర్వాత తొలిసారి
ప్రతి ఏడాది గ్రాండ్‌స్లామ్‌లో యూఎస్ ఓపెన్‌ను చివరిగా నిర్వహిస్తారు. అయితే కరోనా ప్రభావంతో రానున్న ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 13 మధ్య, ప్రేక్షకులు లేకుండానే జరపనున్నారు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ మాత్రమే జరిగింది. మే నెలలోని ఫ్రెంచ్ ఓపెన్ కరోనా వల్ల వాయిదా పడగా.. వింబుల్డన్ పూర్తిగా రద్దయింది. 1945లో రెండో ప్రపంచయుద్ధం కారణంగా వింబుల్డన్ తొలిసారి రద్దవగా, 75 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురైంది.
ఇదీ చూడండి... యుఎస్ ఓపెన్‌కు పచ్చజెండా.. యథావిధిగా టోర్నీ