టీ20 ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్ చివరి మ్యాచ్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో(Bravo Retirement). ఈ నేపథ్యంలో తన తదుపరి కార్యాచరణ ఏమిటన్నదానిపై స్పష్టత ఇచ్చాడు.
"క్రికెట్ ఆడటం పూర్తిగా మానేయాలని నిర్ణయించుకున్న రోజు తప్పనిసరిగా కోచింగ్ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటాను. క్రికెట్ నుంచి మాత్రం దూరంగా వెళ్లిపోయే సమస్యే లేదు. నేను కోరుకున్న జీవితాన్ని నాకు ఇచ్చింది క్రికెటే. అందుకే జట్టుకు తిరిగివాల్సింది చాలా ఉందనేది నా అభిప్రాయం."
-- డ్వేన్ బ్రావో, వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్.
ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌కు మాత్రమే రిటైర్మెంట్ ప్రకటించానని ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడతానని చెప్పాడు బ్రావో.
ఇప్పటివరకు 40 టెస్టులు ఆడిన బ్రావో.. 2,200 పరుగులు చేశాడు. 86 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 2,968 పరుగులు చేసి 199 వికెట్లు తీశాడు. టీ20 మ్యాచ్‌ల్లో 1,245 పరుగులు చేసి, 78 వికెట్లు పడగొట్టాడు.
రిటైర్మైంట్ ఇంకా ప్రకటించలేదు: గేల్