తెలంగాణ

telangana

ETV Bharat / sports

విండీస్​ను ఆదుకున్న పొలార్డ్​​.. ఆసీస్​ లక్ష్యం 158 - ఆస్ట్రేలియా

వెస్టిండీస్​తో గ్రూప్​ దశ ఆఖరి మ్యాచ్​లో ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హేజిల్​వుడ్ చెలరేగిపోయాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన విండీస్​.. 157 పరుగులు చేసింది. పొలార్డ్​ రాణించాడు.

t20 world cup 2021
టీ20 ప్రపంచకప్​

By

Published : Nov 6, 2021, 5:18 PM IST

టీ20 ప్రపంచకప్​లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్​లో వెస్టిండీస్​ బ్యాటర్లు మరోసారి తడబడ్డారు. టోర్నీలో తమకు ఇదే ఆఖరు మ్యాచ్​ కాగా, ఇందులోనూ భారీ స్కోరు నమోదు చేయడంలో సఫలం కాలేదు. టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన విండీస్​.. హేజిల్​వుడ్​ దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. కీరన్ పొలార్డ్ (44) రాణించాడు. ఎవిన్ లూయిస్ (29), హెట్​మెయిర్ (27)​ ఫర్వాలేదనిపించారు. ఆఖర్లో రసెల్ (18) మెరిశాడు.

ఆసీస్ బౌలర్లలో హేజిల్​వుడ్​ 4 వికెట్లు, కమిన్స్​, జంపా, స్టార్క్​ తలో వికెట్ పడగొట్టారు.

ABOUT THE AUTHOR

...view details