తొలిసారి టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2021) టైటిల్ గెలిచేందుకు అమీతుమీకి సిద్ధమయ్యాయి ఆస్ట్రేలియా-న్యూజిలాండ్. ఆదివారం జరుగుతున్న ఫైనల్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్‌ను (Australia vs New Zealand) బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
కివీస్ తొలిసారి పొట్టి కప్పులో తుది పోరు ఆడబోతుండగా.. ఆసీస్‌కిది రెండో ఫైనల్(AUS vs NZ Final). 2015 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడిన కివీస్.. ఇప్పుడా జట్టుపై ప్రతీకారం తీర్చుకుని ఈ ఏడాది రెండో ఐసీసీ ట్రోఫీ అందుకోవాలని చూస్తోంది. ఇప్పటికే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా నిలిచిన విలియమ్సన్ సేన.. అదే ఊపులో పొట్టి కప్పునూ పట్టేయాలనుకుంటోంది. 2010 ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిన ఆసీస్.. ఈ సారి మాత్రం ట్రోఫీని వదలకూడదనే పట్టుదలతో ఉంది.
ఆస్ట్రేలియా ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది. కివీస్ జట్టులో గాయం కారణంగా కాన్వే తప్పుకోగా, అతడి స్థానంలో టిమ్ సీఫర్ట్ చేరాడు.