టీ20 ప్రపంచకప్లో (T20 World Cup 2021) భాగంగా అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ మధ్య మ్యాచ్ నేపథ్యంలో అనూహ్య ఘటన జరిగింది. స్టేడియం చీఫ్ క్యురేటర్ మోహన్ సింగ్ (Mohan Singh Death News) ఆదివారం కన్నుమూశారు. మొహాలీకి చెందిన మోహన్ సింగ్.. నవంబర్ 7న అఫ్గాన్, కివీస్ మధ్య మ్యాచ్కు (NZ vs Afg T20) క్యురేటర్గా ఉన్నారు. మ్యాచ్కు ముందు ఆయన తన గదిలో విగతజీవిగా పడి ఉన్నట్లు సమాచారం.
మోహన్.. 2004లో అబుదాబికి వచ్చారు. అంతకుముందు పంజాబ్లోని మొహాలీలో ఉన్న పంజాబ్ క్రికెట్ స్టేడియంలో క్యురేటర్గా శిక్షణ పొందారు. అక్కడ ఆయన 1994లో చేరారు. తొలుత గ్రౌండ్ సూపర్వైజర్గా, తర్వాత కోచ్గా, సహాయకుడిగా సేవలందించారు.