PAK VS NAM T20: కోహ్లీ రికార్డును తిరగరాసిన బాబర్ అజామ్
టీ20 ప్రపంచకప్(t20 world cup 2021)లో భాగంగా మంగళవారం నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించింది పాకిస్థాన్. తద్వారా సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. కాగా, ఈ మ్యాచ్ ద్వారా పలు రికార్డులు నమోదు చేశారు పాక్ ఆటగాళ్లు. అవేంటో చూద్దాం.
బాబర్ అజామ్
టీ20 ప్రపంచకప్(t20 world cup 2021)లో వరుస విజయాలతో దూసుకెళ్తోంది పాకిస్థాన్. మంగళవారం నమీబియాపై విజయంతో సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది(పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి). తద్వారా ఈ సీజన్లో సెమీస్‌లో అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలిచింది. కాగా, ఈ మ్యాచ్ ద్వారా పలు రికార్డులు కొల్లగొట్టారు పాక్ ఆటగాళ్లు. అవేంటో చూద్దాం.
- టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక భాగస్వామ్య పరుగులు చేసిన జాబితాలో పాకిస్థాన్ ఓపెనర్లు బాబర్ అజామ్-మహ్మద్ రిజ్వాన్(babar azam and mohammad rizwan) రెండో స్థానానికి చేరుకున్నారు. 335 పరుగులతో గిల్‌క్రిస్ట్-హెడెన్ (2007 ప్రపంచకప్) అగ్రస్థానంలో నిలవగా.. 305 రన్స్‌తో బాబర్-రిజ్వాన్ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. దిల్షాన్-జయసూర్య (2009 ప్రపంచకప్) 300 పరుగులతో మూడో స్థానంలో ఉన్నారు.
- ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక ఓపెనింగ్ సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పిన జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు బాబర్- రిజ్వాన్. వీరిద్దరూ ఇప్పటివరకు 4 శతక భాగస్వామ్యాలు నెలకొల్పారు. బెయిర్‌స్టో-మలన్, బవుమా-హెండ్రిక్స్, గప్తిల్-కాన్వే, డికాక్-హెండ్రిక్స్, మలన్-మర్క్రమ్, నయీమ్-సర్కార్.. ఒక్కో సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు.
- ఓ క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగులకుపైగా బాగస్వామ్యం నమోదు చేసిన తొలి జోడీగా రికార్డు సృష్టించారు బాబర్-రిజ్వాన్. వీరిద్దరు ప్రస్తుతం 1041 రన్స్‌తో ఉన్నారు. ఓబ్రెయిన్-స్టిర్లింగ్ (756), కూపర్-ఓడౌడ్ (662), ధావన్-రోహిత్ (621) తర్వాతి స్థానాల్లో నిలిచారు.
- టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక శతక భాగస్వామ్యాలు నమోదు చేసిన జాబితాలో గిల్‌క్రిస్ట్-హెడెన్(2007), కోహ్లీ-రోహిత్(2014)ల సరసన నిలిచారు బాబర్-రిజ్వాన్. వీరంతా రెండేసి శతక భాగస్వామ్యాలు నమోదు చేశారు.
- పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ టీ20ల్లో ఓ క్యాలెండర్ ఇయర్లో 900 పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.
- టీ20ల్లో కెప్టెన్‌గా అత్యధిక అర్ధసెంచరీలు చేసిన జాబితాలో కోహ్లీని వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు బాబర్ అజామ్(babar azam vs virat kohli). 14 హాఫ్ సెంచరీలతో (27 ఇన్నింగ్స్‌ల్లో) ఇతడు మొదటి స్థానంలో ఉండగా.. కోహ్లీ (13, 44 ఇన్నింగ్స్‌ల్లో), ఫించ్ (11), విలియమ్సన్ (11), మోర్గాన్ (9), డుప్లెసిస్ (8) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
- టీ20 ప్రపంచకప్‌లో ఒకే సీజన్లో మూడు అర్ధసెంచరీల నమోదు చేసిన తొలి కెప్టెన్‌గానూ రికార్డు సృష్టించాడు బాబర్ అజామ్(babar azam centuries).
ఇవీ చూడండి: T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో పెద్దోడు-చిన్నోడు వీరే!
Last Updated : Nov 3, 2021, 9:09 AM IST