తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇంగ్లాండ్​పై కివీస్ విజయం.. నీషమ్​ ఫొటో వైరల్! - నీషమ్ వైరల్ వీడియో

టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్​లో ఇంగ్లాండ్​పై విజయం సాధించింది న్యూజిలాండ్. ఈ సమయంలో కివీస్ ఆటగాళ్లు, సహాయసిబ్బంది అందరూ ఆనందంలో మునిగిపోగా.. నీషమ్ మాత్రం ప్రశాంతంగా కూర్చున్నాడు. ఎందుకో తెలుసా?

Neesham
నీషమ్

By

Published : Nov 11, 2021, 10:49 AM IST

టీ20 ప్రపంచకప్​లో భాగంగా ఇంగ్లాండ్​తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్​లో విజయం సాధించింది న్యూజిలాండ్. తద్వారా పొట్టి మెగాటోర్నీలో తొలిసారి ఫైనల్​కు చేరుకుంది. కాగా ఈ మ్యాచ్​లో దాదాపు ఇంగ్లాండ్ విజయం ఖాయమన్న స్థితిలో క్రీజులోకి వచ్చి కివీస్​ను గెలుపు గీత దాటించాడు నీషమ్. ఫలితంగా 2019లో వన్డే ప్రపంచకప్​లో ఇంగ్లాండ్​పై ఓటమికి ప్రతీకారం తీర్చుకునేలా చేశాడు.

167 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన న్యూజిలాండ్​ ఆదిలోనే గప్తిల్, విలియమ్సన్ వికెట్లు కోల్పోయింది. మరో ఓపెనర్ డారైల్ మిచెల్​ (47 బంతుల్ల 72) అద్వితీయ పోరాటంతో కివీస్​ కోలుకుంది. కానీ మ్యాచ్ స్వరూపాన్ని మార్చింది మాత్రం నీషమ్. కేవలం 11 బంతుల్లోనే 27 పరుగులు చేసి కివీస్ విజయాన్ని ఖాయం చేశాడు.

ప్రశాంతంగా..

ఊపులో ఉన్న నీషమ్​ను పెవిలియన్ చేర్చాడు అదిల్ రషీద్. ఆ తర్వాత మిచెల్​ 19 ఓవర్ చివరి బంతికి ఫోర్ బాది కివీస్​కు విజయాన్ని అందించాడు. అంతే ఫైనల్​కు చేరుకున్నామన్న ఆనందంలో డగౌట్​లో అందరూ ఎగిరిగంతులేయగా.. నీషమ్ మాత్రం అలా ప్రశాంతంగా కూర్చిండిపోయాడు. ఇదే ఫొటో నెట్టింట వైరల్​గా మారగా.. దీనిపై స్పందిస్తూ.. 'పని పూర్తయిందా? నాకైతే అలా అనిపించడం లేదు' అంటూ క్యాప్షన్ పెట్టాడు. అంటే ఫైనల్​ మ్యాచ్​ ఇంకా మిగిలే ఉందని.. లక్ష్యం టైటిల్ గెలవడమని పరోక్షంగా చెప్పాడు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

ఇవీ చూడండి:మాలిక్, రిజ్వాన్​కు అస్వస్థత.. కీలకపోరు ముందు పాక్​లో ఆందోళన!​

ABOUT THE AUTHOR

...view details