టీ20 ప్రపంచకప్‌లో టాస్ కారణంగానే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయామని చెప్పిన టీమ్ఇండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్(bharat arun india bowling coach) వ్యాఖ్యలపై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్(harbhajan singh news today) స్పందించాడు. జట్టు యాజమాన్యం ఇలాంటి సాకులు చెప్పి తప్పించుకోవాలని చూడొద్దని భజ్జీ అన్నాడు.
"గెలుపోటములకు టాస్‌తో సంబంధం లేదు. ఐపీఎల్ ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. అలాగే, టాస్‌తో సంబంధం లేకుండా చాలా జట్లు గొప్ప విజయాలు సాధించాయి. చిన్న చిన్న జట్లే ఇలాంటి సాకులు చెబుతాయి. కానీ, భారత్ లాంటి బలమైన జట్టుకు కోచ్‌లుగా ఉన్నవ్యక్తులు అలాంటివి చెప్పకూడదు. మన జట్టు మెరుగ్గా రాణించలేకపోయిందనే వాస్తవాన్ని ఒప్పుకోవాలి. కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. ఇదేం పెద్ద సమస్య కాదు. గతంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నించాలి"
-- హర్భజన్ సింగ్, మాజీ అటగాడు.