టీ20 ప్రపంచకప్‌లో వరుసగా రెండు పరాజయాలు చవిచూసింది టీమ్ఇండియాteam India t20 world cup 2021). దీంతో అటు ఆటగాళ్లు, ఇటు మేనేజ్మెంట్పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు పలువురు మాజీలు, అభిమానులు. కొందరు జట్టు సెలక్షన్‌ను తప్పుపడుతుంటే మరికొందరు బిజీ షెడ్యూల్‌పై మండిపడుతున్నారు. ఆరు నెలలుగా భారత జట్టు బయోబబుల్‌లో ఉండటం వల్ల ఆటగాళ్లు మానసికంగా అలిసిపోయారని అంటున్నారు. ఇదే విషయమై స్పందించాడు టీమ్ఇండియా పేసర్ బుమ్రా(jasprit bumrah t20 world cup). కుటుంబాలకు దూరంగా ఉండటం వల్ల ఆ ప్రభావం ఆటగాళ్లపై పడుతోందని తెలిపాడు.
"ఆటగాళ్లకు కొన్నిసార్లు విరామం అవసరం. కుటుంబానికి దూరంగా ఉంటుంటారు. ఆరు నెలలుగా విరామం లేకుండా ఆడుతున్నాం. ఇంత సుదీర్ఘ కాలం కుటుంబానికి దూరంగా, బయోబబుల్‌లో ఉండటం వల్ల ఆటగాళ్ల మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. మేమంతా సౌకర్యవంతంగా ఉండేందుకు బీసీసీఐ సాధ్యమైనంత మేర ప్రయత్నిస్తోంది. ఇది చాలా కష్టసమయం. మహమ్మారి ప్రభావం కొనసాగుతోంది. అందువల్ల ఈ బబుల్‌కు అలవాటు పడటానికి ప్రయత్నిస్తున్నాం. మానసిక అలసట కూడా వేధిస్తోంది."