తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఖేల్​రత్నకు వినేశ్, పూనియా పేర్లు సిఫార్సు! - phogat

రెజ్లర్లు వినేశ్ ఫోగాట్, భజరంగ్ పూనియా పేర్లను ఖేల్​రత్న అవార్డుకు సిఫార్సు చేసింది భారత రెజ్లింగ్ సమాఖ్య. భీమ్​సింగ్​, జైప్రకాశ్​లను ధ్యాన్​చంద్​ అవార్డుకు సూచించింది.

రెజ్లింగ్

By

Published : Apr 29, 2019, 1:03 PM IST

ఖేల్​రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డులకు పేర్లు సిఫార్సు చేసింది భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్​ఐ). వర్ధమాన రెజ్లర్లు వినేశ్ ఫోగాట్, భజరంగ్​ పూనియాను ఖేల్​రత్న అవార్డుకు సూచించింది. భీమ్​సింగ్, జైప్రకాశ్​లను ధ్యాన్​చంద్ అవార్డుకు సిఫార్సు చేసింది డబ్ల్యూఎఫ్​ఐ.

రాహుల్ అవారే, హర్ప్రీత్​ సింగ్, దివ్యా కాక్రన్, పూజా ధాండాను అర్జున అవార్డుకు సిఫార్సు చేసింది డబ్ల్యూఎఫ్​ఐ. వీరేంద్ర కుమార్, సూజిత్ మాన్, నరేంద్రకుమార్, విక్రమ్​ కుమార్​ పేర్లను ద్రోణాచార్య అవార్డుకు సూచించింది.

ABOUT THE AUTHOR

...view details