హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్.. ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని ఓ ఆశ్రమంలో తలదాచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 4నఛత్రశాల్ స్టేడియంలో జరిగిన గొడవలో మల్లయోధుడు సాగర్ రానా మృతికి, సుశీల్‌కు సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు. దీంతో అతడికి లుక్ ఔట్ నోటీసులు జారీ చేసి, విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చూడండి:రెజ్లర్ సుశీల్ కుమార్‌కు లుక్ఔట్ నోటీసులు జారీ
ఈ నేపథ్యంలోనే ప్రముఖ యోగా గురువు ఆశ్రమంలో సుశీల్ తలదాచుకున్నాడనే సమాచారం మేరకు దిల్లీ పోలీసులు హరిద్వార్ చేరుకున్నారు. ఆశ్రమంలో సోదా చేసి సుశీల్‌ను అరెస్టు చేయడానికి ఉన్నతాధికారుల అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.