తెలంగాణ

telangana

ETV Bharat / sports

వివాహబంధంతో ఒక్కటైన మల్లయోధులు - sangeeta phogat marriage

మరో రెజ్లింగ్‌ ప్రేమ జంట పెళ్లిపీటలెక్కింది. భారత అగ్రశ్రేణి రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పునియా, సంగీత ఫొగాట్‌ బుధవారం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తాజాగా సోషల్​మీడియాలో పంచుకున్నారీ నూతన వధూవరులు.

wrestler BajrangPunia tie knot to his co-wrestler sangeeta phogat
వివాహబంధంతో ఒక్కటైన మల్లయోధులు

By

Published : Nov 26, 2020, 8:15 PM IST

ప్రముఖ మల్లయోధులు బజ్​రంగ్ పునియా, సంగీత ఫొగాట్​ వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇరువురి కుటుంబాల సమక్షంలో బుధవారం వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్​ మీడియాలో షేర్​ చేశారు వధూవరులు.

ప్రేమ పెళ్లి..

మహావీర్‌ సింగ్‌ ఫొగాట్‌ చిన్న కుమార్తె అయిన సంగీత.. బజ్‌రంగ్‌ను తొలిసారి మూడేళ్ల క్రితం జాతీయ శిక్షణ శిబిరంలో కలిసింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. ఫొగాట్‌ సిస్టర్స్‌ (గీత, బబిత, ప్రియాంక, రితు, వినేశ్‌)లో చిన్నదైన 22 ఏళ్ల సంగీత తన అక్కల బాటలోనే నడుస్తూ రెజ్లింగ్‌లో రాణిస్తోంది.

గీత, సంగీతలను అంతర్జాతీయ స్థాయిలో మల్లయోధులుగా తీర్చిదిద్దిన వారి తండ్రి మహావీర్‌సింగ్‌ జీవితం ఆధారంగానే అమీర్‌ఖాన్‌ ముఖ్యపాత్ర పోషించిన 'దంగల్‌' సినిమా తెరకెక్కింది.

ABOUT THE AUTHOR

...view details