భారత అథ్లెట్లు టోక్యో వెళ్లేది ఒలింపిక్స్ (Tokyo Olympics)లో పాల్గొనేందుకు మాత్రమే కాదని, పతకాలు గెలిచేందుకేనని కేంద్ర క్రీడా మంత్రి కిరెన్ రిజిజు(Kiren Rijiju) స్పష్టం చేశారు. ఇప్పటికైతే భారత్ నుంచి 110 మంది ఆటగాళ్లు ఈ మెగా ఈవెంట్లో పాల్గొంటున్నారు. ఈ సంఖ్య 120-130కి పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
మన్ కీ బాత్(Mann Ki Baat) కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) అథ్లెట్లను ప్రశంసించిన అనంతరం రిజిజు ఈ వ్యాఖ్యలు చేశారు. టోక్యోలో పాల్గొంటున్న ఆటగాళ్లకు జాతి యావత్తు మద్దతుగా నిలవాలని మోదీ పేర్కొన్నారు.
"మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ భారత అథ్లెట్ల గురించి ప్రస్తావించడం గర్వంగా అనిపించింది. ఎందుకంటే ప్రధాని వారికి మద్దతుగా, ఉత్సాహపరిచేలా మాట్లాడారు. ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్న ఇలాంటి పీఎం ఉన్నందుకు క్రీడా మంత్రిగా నాకు గర్వంగా ఉంది. టోక్యో ఒలింపిక్స్లో ఇండియా అత్యుత్తమ ప్రదర్శన చేస్తుందనే ఆత్మవిశ్వాసం నాలో ఉంది. ఎందుకంటే మన దగ్గర ప్రపంచస్థాయి అథ్లెట్లు ఉన్నారు. మన ఆటగాళ్లు టోక్యోకు వెళ్లేది కేవలం ఆడటానికే కాదు. పతకాలు గెలుచుకోవడానికి"