తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఖేల్​రత్నకు ఎంపికైన రెజ్లర్​కు కరోనా

ప్రముఖ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్​కు కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. ఐసోలేషన్​లోనే ప్రస్తుతం ఉన్నట్లు ఆమె చెప్పింది.

ఖేల్​రత్నకు ఎంపికైన రెజ్లర్​కు కరోనా పాజిటివ్
రెజ్లర్ వినేశ్ ఫొగాట్

By

Published : Aug 28, 2020, 8:37 PM IST

భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ఖేల్​రత్నకు ఎంపికైన ఈమె.. వైరస్ సోకిన కారణంగా అవార్డుల ప్రదానోత్సవాన్ని మిస్ కానుంది.

"అవును. నాకు కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. త్వరలో కోలుకుంటానని అనుకుంటున్నాను. ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్​లో ఉన్నాను" -వినేశ్ ఫొగాట్, రెజ్లర్

మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్

స్వస్థలం సోన్​పేట్​లో కోచ్ ఓం ప్రకాశ్ ఆధ్వర్యంలో టోక్యో ఒలింపిక్స్​ కోసం వినేశ్ శిక్షణ తీసుకుంటోంది. ఈ సమయంలో కరోనా వచ్చినట్లు తేలింది. గతంలో ఈమె ఆసియా క్రీడలు, కామన్వెల్త్​ గేమ్స్​లో స్వర్ణ పతకాలు గెలుచుకుంది.

ABOUT THE AUTHOR

...view details