Tokyo Paralympics: అవనికి కాంస్యం.. 12కు చేరిన భారత పతకాలు - టోక్యో ఒలింపిక్స్
10:57 September 03
Tokyo Paralympics: అవని రికార్డు కాంస్యం.. 12కు చేరిన భారత పతకాలు
జపాన్ టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య 12కు చేరింది. మహిళల షూటింగ్ ఆర్8 50మీ. రైఫిల్ 3పీ విభాగంలో.. అవని లేఖరా కాంస్యం సాధించింది. అంతకుముందు ఈమె.. ఆర్2 10 మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో బంగారు పతకం సాధించడం విశేషం. దీంతో పారాలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మొదటి భారత మహిళా క్రీడాకారణిగా రికార్డుకెక్కింది.
మోదీ ప్రశంసలు
టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణంతో పాటు కాంస్యం సాధించిన అవని లేఖరాపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. "పారాలింపిక్స్‌కు మరింత కళ వచ్చింది. అవని లేఖరా ప్రదర్శన చూసి సంతోషం వేస్తోంది. కాంస్య పతకం సాధించినందుకు శుభాకాంక్షలు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలని కోరుకుంటున్నా" అంటూ ట్వీట్ చేశారు.