తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఒలింపిక్స్​: కరోనా కేసులు 100+.. అథ్లెట్లలో కలవరం! - Olympics

ఒలింపిక్స్​ ఆరంభోత్సవం నాడే కరోనా కలవరపెడుతోంది. ఇప్పటికే క్రీడా గ్రామంలో కేసులు 100 దాటినట్టు సమాచారం. చెక్​ రిపబ్లిక్​ బృందంలో ఎక్కువ మందికి పాజిటివ్​గా తేలినట్లు తెలుస్తోంది.

Tokyo Olympics
కరోనా కేసులు

By

Published : Jul 23, 2021, 2:28 PM IST

టోక్యో ఒలింపిక్స్‌కు సంబంధించిన కొవిడ్‌-19 కేసులు శుక్రవారం నాటికి వంద దాటాయి. కొత్తగా 19 మందికి వైరస్‌ సోకినట్టు తెలుస్తోంది. చెక్‌ రిపబ్లిక్‌ బృందంలోనే ఎక్కువ మంది కరోనా బారిన పడ్డారు. రోడ్‌ సైకిలిస్టు మైకేల్‌ షెలిజెల్‌ ఆ బృందంలో పాజిటివ్‌గా తేలిన నాలుగో ఆటగాడు కావడం గమనార్హం.

శుక్రవారమే ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవం. అంగరంగ వైభంగా జరగాల్సిన క్రీడలు మహమ్మారి వల్లే సాదాసీదాగా సాగుతున్నాయి. ఆరంభోత్సవానికి వెయ్యిమంది లోపే ఆహ్వానం అందింది(అథ్లెట్లు, అధికారులతో కలిపి). ఈ రోజు ముగ్గురు అథ్లెట్లు, పది మంది క్రీడా సిబ్బంది, ముగ్గురు మీడియా వ్యక్తులు, ముగ్గురు కాంట్రాక్టర్లకు వైరస్‌ సోకిందని నిర్వాహకులు తెలిపారు.

వైద్యుడికి సైతం..

ఇప్పటి వరకు 106 మందికి వైరస్‌ సోకింది. అందులో 11 మంది అథ్లెట్లు. తాజాగా మైకేల్‌కు కరోనా రావడం వల్ల అతడిని ఐసోలేషన్‌కు పంపించారు. జమైకా లాంగ్‌ జంపర్‌ కేరీ మెక్‌లియాడ్‌కు సొంత దేశంలోనే పాజిటివ్‌ రావడం కారణంగా ఆటలకు దూరమయ్యాడని సమాచారం. ఇక చెక్‌ బృందానికి చెందిన వైద్యుడికి సైతం పాజిటివ్‌ రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌ గ్రామంలో ఇంకా ఎంతమందికి వైరస్‌ సోకుతుందోనని ఆందోళన కలుగుతోంది.

ఇదీ చూడండి:జోరు మీదున్న ఆర్చర్లు- ఈసారి పతకం పక్కా!

ABOUT THE AUTHOR

...view details