తెలంగాణ

telangana

ETV Bharat / sports

రివ్యూ 2019: భవిష్యత్తుపై భరోసా ఇస్తోన్న యువకెరటాలు

ఆటలు అంటే గుర్తొచ్చేది యువతరమే.. వారి కేరింతలే! భారత క్రీడారంగంలోనూ ఈ ఏడాది కుర్రజోరు కనిపించింది.. కొందరు సీనియర్లను తలదన్నేలా రాణిస్తే.. ఇంకొందరు భవిష్యత్తుపై భరోసా ఇచ్చారు.. ఇలా మన క్రీడా రంగంలో ముద్ర వేసిన ఆ యువ కెరటాలెవరో చూద్దామా..

By

Published : Dec 31, 2019, 8:14 AM IST

The winners in the sports Category in 2019
అదరహో.. చిరుతలు

ఈనాడు క్రీడావిభాగం

యశస్వి జైస్వాల్​ (క్రికెట్​, వయసు 17)

అదరహో.. చిరుతలు

ముంబయిలో పానీపురి అమ్మి.. పెయింటింగ్‌ పని చేసే నాన్నకు సాయం చేసేవాడు. ఒకవైపు పనులు చేస్తూనే క్రికెట్‌ నేర్చుకున్నాడు.
పేరొచ్చిందిలా:విజయ్‌ హజారె టోర్నీలో ఝార్ఖండ్‌పై డబుల్‌ సెంచరీ (154 బంతుల్లో 203) చేయడం ద్వారా..
ప్రత్యేకత: దూకుడైన బ్యాట్స్‌మన్‌. అలవోకగా సిక్సర్లు బాదేస్తాడు. విజయ్‌ హజారే టోర్నీలో 25 సిక్స్‌లు కొట్టాడు. ఐపీఎల్‌ వేలంలో ఈ లెఫ్ట్‌ హ్యాండర్‌ని రాజస్థాన్‌ రాయల్స్‌ రూ.2.40 కోట్లకు ఎగరేసుకుపోయింది. అండర్‌-19 ప్రపంచకప్‌ జట్టులోనూ సభ్యుడు.

షెఫాలీ వర్మ (క్రికెట్​, వయసు 15)

అదరహో.. చిరుతలు

రోహ్‌తక్‌కు చెందిన ఈ చిన్నది.. 15 ఏళ్లకే భారత జట్టులో చోటు సంపాదించింది.
పేరొచ్చిందిలా: పిన్న వయసులో అంతర్జాతీయ అర్ధసెంచరీ సాధించిన భారత క్రికెటర్‌గా తన ఆరాధ్య ఆటగాడు సచిన్‌ తెందుల్కర్‌ రికార్డు బద్దలు కొట్టింది.
ప్రత్యేకత: సెహ్వాగ్‌ మాదిరిగా ఆరంభం నుంచే బౌలర్లపై విరుచుకుపడుతుంది. భుజ బలంతో భారీ షాట్లు ఆడుతుంది. క్రీజు వదలి ముందుకొచ్చి ఆమె కొట్టే భారీ షాట్లను చూసి తీరాల్సిందే. టీ20తో పాటు మిగిలిన ఫార్మాట్లలోనూ ఆడాలనే లక్ష్యం.

దీపక్​ పునియా (రెజ్లింగ్​, వయసు 18)

అదరహో.. చిరుతలు

హరియాణాలోని పేద కుటుంబం నుంచి వచ్చాడు. నాన్నతో పాటు పాలు అమ్మేవాడు. సుశీల్‌కుమార్‌ ఆదర్శంగా ఎదిగాడు.
పేరొచ్చిందిలా: ప్రపంచ క్యాడెట్‌ రెజ్లింగ్‌ ఛాంపియన్‌ కావడం, ఆ తర్వాత 2019లో అరంగేట్రంలోనే ప్రపంచ సీనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలవడం.
ప్రత్యేకత: జూనియర్‌ అయినా ఎలాంటి బెరుకు లేదు.. సీనియర్లలో ఆడిన తొలి టోర్నీలోనే ఐరోపా, ఆసియా ఛాంపియన్లను ఓడించడమే ఇందుకు నిదర్శనం. ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా సాగుతున్నాడు.

దివ్యాంశ్​ పన్వర్​ (షూటింగ్​, వయసు 17)

అదరహో.. చిరుతలు

స్వస్థలం రాజస్థాన్‌లోని జైపుర్‌, 12 ఏళ్లకే గన్‌ పట్టాడు. పబ్‌జీకి బానిస కావడం వల్ల దాని నుంచి మళ్లించడం కోసం షూటింగ్‌ని వ్యాపకంగా ఎంచుకున్నాడు.
పేరొచ్చిందిలా: 2019లో జరిగిన రెండు షూటింగ్‌ ప్రపంచకప్‌ల్లో నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం గెలిచాడు.
ప్రత్యేకత: సీనియర్లకు దీటుగా రాణిస్తున్నాడు. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో టాప్‌ షూటర్‌గా దూసుకెళ్తున్నాడు. ముఖ్యంగా ఐరోపా షూటర్లకు గట్టిపోటీ ఇస్తున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌ బెర్తు సంపాదించాడు.

గుకేశ్​ (చెస్​, వయసు 13)

అదరహో.. చిరుతలు

చెన్నైకు చెందిన గుకేశ్‌. ఏడేళ్ల వయసు నుంచే చెస్‌పై పట్టు సంపాదించాడు.
పేరొచ్చిందిలా: 2015లో ఆసియా అండర్‌-9 చెస్‌ విజేతగా నిలిచిన గుకేశ్‌.. 2018లో ప్రపంచ అండర్‌-12 క్లాసిక్‌, బ్లిట్జ్‌, ర్యాపిడ్‌ టైటిళ్లు సాధించాడు.
ప్రత్యేకత: 12 ఏళ్ల 7 నెలల 17 రోజుల వయసులో గ్రాండ్‌మాస్టర్‌ హోదా సంపాదించి ఈ ఘనత సాధించిన భారత పిన్న వయస్కుడిగా గుకేశ్‌ చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలో గ్రాండ్‌మాస్టర్‌ హోదా సంపాదించిన రెండో పిన్న వయస్కుడు గుకేశ్‌.

ఇషాసింగ్‌ (షూటింగ్‌, వయసు 14)

అదరహో.. చిరుతలు

ఈ హైదరాబాద్‌ అమ్మాయి ఈ ఏడాదే జాతీయ షూటింగ్‌ తెరపైకి వచ్చింది. సంచలన విజయాలతో దూసుకెళ్తోంది.
పేరొచ్చిందిలా: 13 ఏళ్లకే జాతీయ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో హీనా సిద్ధు, మను బాకర్‌ లాంటి స్టార్లను వెనక్కి నెట్టి 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో స్వర్ణం గెలుచుకుంది.
ప్రత్యేకత: షార్ప్‌ షూటర్‌.. తీవ్ర ఒత్తిడిలోనూ లక్ష్యాన్ని ఛేదించగలదు. ఇటీవలే ఆసియా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో జూనియర్‌ విభాగంలో స్వర్ణం గెలిచిన ఇషా.. సీనియర్‌ విభాగంలో వడివడిగా అడుగులు వేస్తోంది.

ఇసో అల్బెన్​ (సైక్లింగ్​, వయసు 18)

అదరహో.. చిరుతలు

అండమాన్‌ నికోబార్‌ దీవుల నుంచి వచ్చాడు. అగ్నిమాపక దళంలో పని చేసే నాన్న అల్బన్‌ సైక్లిస్ట్‌ అయినందున ఇసో కూడా అదే బాట పట్టాడు.
పేరొచ్చిందిలా: 2019 ప్రపంచ జూనియర్‌ ట్రాక్‌ ఛాంపియన్‌షిప్‌లో రెండు వ్యక్తిగత రజత, కాంస్య పతకాలతో పాటు టీమ్‌ స్వర్ణాన్ని సాధించడం ద్వారా..
ప్రత్యేకత: ప్రపంచ ట్రాక్‌ సైక్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన తొలి భారత సైక్లిస్ట్‌. ప్రస్తుతం జూనియర్‌లో ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్నాడు. ఒలింపిక్స్‌లో పాల్గొనాలనేది లక్ష్యం.

లాల్​రెమ్​సియామి (హాకీ, వయసు 18)

అదరహో.. చిరుతలు

మిజోరాంలోని ఒక పేద కుటుంబంలో పుట్టింది. తండ్రి వ్యవసాయ కూలీ. భారత హాకీ జట్టులో కీలక క్రీడాకారిణి.
పేరొచ్చిందిలా: అండర్‌-18 యూత్‌ ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌లో భారత్‌ తరఫున ఏడు గోల్స్‌ చేసి టాప్‌ స్కోరర్‌గా నిలవడం ద్వారా. 2018 ఆసియా ఛాంపియన్‌ట్రోఫీ, ప్రపంచకప్‌లో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించింది.
ప్రత్యేకత: మైదానంలో మెరుపులా దూసుకెళ్తుంది. బంతిని లాఘవంగా ప్రత్యర్థి నుంచి లాక్కొని.. స్ట్రెకర్లకు అందిస్తుంది. బంతిని డ్రిబుల్‌ చేసుకుంటూ ప్రత్యర్థి వలయాన్ని ఛేదిస్తూ గోల్స్‌ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.

అర్జున్​ భాటి (గోల్ఫ్​, వయసు 14)

అదరహో.. చిరుతలు

నోయిడాకు చెందిన ఈ కుర్రాడు ఎనిమిదేళ్లకే గోల్ఫ్‌లోకి వచ్చాడు.
పేరొచ్చిందిలా: 14 ఏళ్లకే ప్రపంచ జూనియర్‌ గోల్ఫ్‌ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు.
ప్రత్యేకత: ఇప్పటిదాకా 105 టైటిళ్లు ఇతడి ఖాతాలో ఉన్నాయి. నంబర్‌వన్‌పై గురి పెట్టిన ఈ కుర్రాడికి సీనియర్‌ సర్క్యూట్‌లోనూ రాణించాలనే సంకల్పంతో పాటు ఒలింపిక్స్‌లో ఆడాలనే కల ఉంది.

ABOUT THE AUTHOR

...view details