దేశవ్యాప్తంగా 1000 ఖేలో ఇండియా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ. జిల్లా స్థాయిలోని క్రీడాకారులకు శిక్షణను అందించడమే లక్ష్యంగా వీటిని నెలకొల్పతున్నట్లు క్రీడామంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. ఆటగాళ్లకు, వారికి శిక్షణ ఇచ్చే నిపుణులకు తగిన పారితోషికం అందించనున్నారు. ఈ కేంద్రాల్లో మాజీ ఛాంపియన్లను కోచ్‌లుగా నియమించి పర్యవేక్షించనున్నారు.
"క్రీడల్లో భారత్‌ను సూపర్‌పవర్‌గా మార్చేందుకు, క్రీడలను యువత కెరీర్‌గా ఎంచుకునే విధంగా చర్యలు చేపట్టాలి. ఆటగాళ్లకు నిరంతర జీవనోపాధిని అందించగలిగినప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలను దీనిని కెరీర్‌గా ఎంచుకునేలా ప్రోత్సాహిస్తారు. వారిలో ఉత్తమ ప్రతిభను వెతకేందుకు ఉన్న దారి ఇదే. లేకపోతే ఇంకో రంగాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది"
- కిరణ్ రిజిజు, కేంద్ర క్రీడా మంత్రి
ఈ కొత్త విధానంతో మాజీ ఛాంపియన్లు స్వతహాగా అకాడమీలు ఏర్పాటు చేసుకోవడం సహా ఖేలో ఇండియా కేంద్రాల్లో విధులు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఈ కేంద్రాలను నడపడంలో భాగంగా, అథ్లెట్ల ప్రతిభను బట్టి నాలుగు విభాగాలుగా విభజించారు.
కేటగిరీ 1: అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో ప్రాతినిధ్యం వహించిన అథ్లెట్లు.