కరోనా నాలుగో విడత లాక్డౌన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈసారి సడలింపులు ఇచ్చిన వాటిలో క్రీడా ప్రాంగణాలు, స్టేడియాలు కూడా ఉన్నాయి.
తెరుచుకోనున్న క్రీడా ప్రాంగణాలు, స్టేడియాలు - కరోనా లాక్డౌన్
కరోనా లాక్డౌన్ నాలుగో విడత మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. క్రీడా ప్రాంగణాలకు, స్టేడియాలకు సడలింపులు ఇచ్చింది. కానీ ప్రేక్షకులకు మాత్రం అనుమతి లేదని స్పష్టం చేసింది.
స్టేడియం
"క్రీడా ప్రాంగణాలు, స్టేడియాలు తెరవచ్చు. కానీ ప్రేక్షకులకు అనుమతి ఉండదు."- ఎన్డీఎమ్ఏ
కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే దేశంలో లాక్డౌన్ కొనసాగుతోంది. మూడో విడతలో కొన్నింటికి సడలింపులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా నాలుగో విడతలో మరికొన్నింటికి సడలింపులు ఇచ్చింది. లాక్డౌన్ మే 31 వరకు కొనసాగుతుందని స్పష్ట చేసింది.