తెలంగాణ

telangana

ETV Bharat / sports

దిశా ఘోష్- నెట్టింట మరో ప్రియా వారియర్! - సోషల్​ మీడియా

కన్నుకొట్టి.. కుర్రకారు మదిని దోచి ఒక్కరోజులో  నేషనల్ ​స్టార్​ అయిన ప్రియా ప్రకాశ్​ వారియర్ అందరికీ గుర్తే ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వర్ధమాన క్రీడాకారిణి​ సందడి చేస్తోంది. ఆట, అందం, అభినయంతో టిక్​టాక్​లో ట్రెండింగ్​లో ఉంది.

దిశాఘోష్​

By

Published : Jun 9, 2019, 3:45 PM IST

Updated : Jun 9, 2019, 4:08 PM IST

ప్రియా ప్రకాశ్ వారియర్.... ఒక్కసారి కన్నుకొట్టి యువత మనసులు దోచేసింది. ఎంతో మంది అబ్బాయిల కలల రాణి అయింది. ట్విట్టర్​, ఇన్​స్టాగ్రామ్​ ఇలా అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ లక్షల కొద్దీ ఫాలోవర్లను, పేరును సంపాదించుకుంది.

ప్రియ తరహాలోనే వాలీబాల్​ ప్లేయర్​ దిశా ఘోష్​... సామాజిక మాధ్యమాల్లో సెలబ్రిటీ అయిపోయింది. ఫ్యాన్​ ఫాలోయింగ్​ అమాంతం పెంచేసుకుంది. ఆట కన్నా అందం.. అభినయంతో కుర్రకారు మనసును దోచేస్తోంది. హావభావాలు, డ్యాన్స్ ఇలా అన్ని కళలు ప్రదర్శిస్తూ యూత్​ను ఆకర్షిస్తోంది. ప్రస్తుతం టిక్​టాక్​లో​ ట్రెండ్​ అవుతోంది. ఆమె పోస్టులకు వేలాది లైకులు, షేర్లు వస్తున్నాయి. కామెంట్లకు లెక్కేలేదు. ఈమెకు సోషల్​ మీడియాలో ఏకంగా ఫ్యాన్స్​ అసోసియేషన్లు ఉన్నాయి.

ఇదీ నేపథ్యం....

దిశా ఘోష్​ది బంగాల్​. ఆ రాష్ట్ర​ వాలీబాల్ బాలికల జట్టు సభ్యురాలు. 2018లో కేంద్ర క్రీడాశాఖ నిర్వహించిన ఖేలో ఇండియా స్కూల్​ గేమ్స్​లో సత్తా చాటి అందరి దృష్టిని ఆకర్షించింది. దిల్లీ వేదికగా జరిగిన అండర్​-17 ఫైనల్​ మ్యాచ్​లో మహారాష్ట్ర జట్టుపై బంగాల్​ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది దిశా ఘోష్.

ఖేలో ఇండియా గేమ్స్​ తర్వాత దిశా ఘోష్​కు ఫ్యాన్​ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇలా నెట్టింట రకరకాల వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇదీ చూడండి : 'భాష ఏదైనా.. పాత్రకు న్యాయం చేయడమే ముఖ్యం'

Last Updated : Jun 9, 2019, 4:08 PM IST

ABOUT THE AUTHOR

...view details