Malaysia Open Super 750: మలేషియా ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అదరగొట్టగా.. సైనా నెహ్వాల్ నిరాశపరిచింది. డిఫెండింగ్ వరల్డ్ ఛాంపియన్ సింధు.. థాయిలాండ్‌కు చెందిన పోర్న్‌పావీ చొచువాంగ్‌పై 21-13,21-17 తేడాతో గెలిచి రెండో రౌండుకు దూసుకెళ్లింది. మరో గేమ్‌లో లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సైనా.. అమెరికా క్రీడాకారిణి ఐరిస్ వాంగ్ చేతిలో 11-21,17-21 తో పరాజయం పాలైంది.
మలేషియా ఓపెన్‌లో దుమ్ము రేపిన సింధు.. నిరాశపరిచిన సైనా - సైనా నెహ్వాల్ న్యూస్
Malaysia Open Super 750: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మలేషియా ఓపెన్ సూపర్ 750లో రెండో రౌండుకు దూసుకెళ్లింది. థాయిలాండ్‌కు చెందిన పోర్న్‌పావీ చొచువాంగ్‌పై 21-13,21-17 తేడాతో గెలిచింది. మరో గేమ్‌లో సైనా నెహ్వాల్ అమెరికా క్రీడాకారిణి ఐరిస్ వాంగ్ చేతిలో 11-21,17-21 తో పరాజయం పాలైంది.
గాయంతో బాధపడుతున్న కామన్వెల్త్ గేమ్స్ మాజీ ఛాంపియన్ పారుపల్లి కశ్యప్.. మెన్స్ సింగిల్స్‌లో విజయంతో పునరాగమనం చేశాడు. కొరియా ఆటగాడు హియో క్వాంగ్పై 21-12, 21-17 తేడాతో విజయం సాధించాడు. సింధు తన తరువాత మ్యాచ్‌లో ఉబర్‌కప్ క్యాంసపతక విజేత థాయిలాండ్‌కు చెందిన చైవాన్‌తో తలపడనుంది. కశ్యప్ జర్మన్ సూపర్ 300 విజేత కున్లావుట్ విటిసార్న్తో పోటీ పడనున్నాడు. థాయ్ క్రీడాకారిణి చొచువాంగ్‌పై పీవీ సింధు రికార్డును సాధించింది. ఇప్పటి వరకు 8సార్లు పోటీపడగా 5-3 తేడాతో ముందంజలో ఉంది.
ఇదీ చదవండి:Wimbledon 2022: సెరెనాకు షాక్.. తొలిరౌండులోనే ఇంటిముఖం