2020 టోక్యో ఒలింపిక్స్‌కు మరో భారత షూటర్ అర్హత సాధించాడు. దోహాలో జరుగుతోన్న 14వ ఆసియన్ ఛాంపియన్‌షిప్‌లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ కాంస్యం కైవసం చేసుకున్నాడు. విశ్వక్రీడల్లో బెర్త్ ఖరారు చేసుకున్నాడు. ఇతడితో కలపి ఇప్పటివరకు 13 మంది భారత షూటర్లు.. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.
పురుషుల 50 మీటర్ల రైఫిల్ విభాగంలో ఎనిమిది మంది పోటీపడగా.. 449.1 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు ప్రతాప్ సింగ్. కొరియాకు చెందిన కిమ్ జోంగ్యూమ్(459.9) స్వర్ణం గెలిచాడు. చైనా క్రీడాకారుడు జోంగావో(459.1) వెండి పతకం సాధించాడు.